తెలుగు నేల ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన ఒంగోలు జాతి- తెలుగు నేల ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన ఒంగోలు జాతి 


- మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని 

- ముగిసిన ఆరు పళ్ళ విభాగం పోటీలు 

- విజేతలకు రూ.2.08 లక్షల నగదు బహుకరణ  గుడివాడ, జనవరి 13 (ప్రజా అమరావతి): తెలుగు నేల ఖ్యాతిని ఒంగోలు జాతి పశువుల ఖండాంతరాలకు చేర్చాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) అన్నారు. గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీల్లో భాగంగా నిర్వహించిన ఆరు పళ్ళ విభాగం పోటీలు ఉత్సాహభరితంగా ముగిసాయి. ఈ సందర్భంగా మొదటి తొమ్మిది స్థానాల్లో నిలిచిన విజేతలకు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) బహుమతులను అందజేశారు. అనంతరం కొడాలి చిన్ని రైతులు, ఒంగోలు జాతి పశు పోషకులను ఉద్దేశించి మాట్లాడారు. గత వైభవానికి ఒంగోలు జాతి గిత్తలు వారధిగా నిలుస్తున్నాయన్నారు. ఒంగోలు జాతి గిత్తల సొగసును చూసేందుకు రెండు కళ్ళూ చాలవని, కాలు దువ్వి రంకె వేసిందంటే గుండెలు గుబేలమనాల్సిందేనని అన్నారు. కొదమ సింహాన్ని సైతం మట్టి కరిపించే కండ బలం, పుట్టుకతోనే వచ్చిన పౌరుషం ఒంగోలు జాతి పశువుల సొంతమన్నారు. ఎడ్లను మేపడం, పందాలకు తరలించడం, రైతుకు గర్వకారణంగా ఉంటుందన్నారు. ఎడ్ల గెలుపును తమ గెలుపుగా భావిస్తూ వాటి యజమానులు గర్వంతో ఉప్పొంగి పోతారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తృతస్థాయిలో ప్రతి ఏటా 200 వరకు పందాలు జరుగుతుంటాయన్నారు. వీటిలో బండ లాగుడు, ఇసుక కావు, చక్రాలు, పరువు, పందిరి పోటీలు ముఖ్యమైనవని తెలిపారు. పంట కాలం పూర్తయిన తర్వాత పందిళ్ళు వేసి నెల రోజుల పాటు పోటీలను నిర్వహిస్తుంటారని చెప్పారు. కాగా ఆరు పళ్ళ విభాగంలో ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం గంగన్నపాలేనికి చెందిన ఉమ్మారెడ్డి శ్రీవల్లి ఎడ్ల జత నిర్ణీత సమయంలో 4,450 అడుగుల మేర బండను లాగి ప్రథమస్థానంలో, కృష్ణాజిల్లా కానూరుకు చెందిన డీవీఆర్ మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు ఎడ్ల జత 4,381.3 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో, చేబ్రోలు మండలం తోటపాలేనికి చెందిన రామినేని రత్తయ్యచౌదరి ఎడ్ల జత 4,313.5 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో, హైదరాబాద్ కు చెందిన మేకా ప్రతీక్ ఎడ్ల జత 4,288 అడుగుల దూరం లాగి నాల్గవ స్థానంలో, గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం నార్నెపాడుకు చెందిన మోపర్తి భవ్యాచౌదరి, పమిడిమర్రుకు చెందిన యరసాని సుబ్బయ్య ఎడ్ల జత 4,148 అడుగుల దూరం లాగి ఐదవ స్థానంలో, కృష్ణాజిల్లా పెద ఓగిరాలకు చెందిన బొమ్మారెడ్డి రవికాంత్ రెడ్డి, పత్తిపాడుకు చెందిన పమిడి అంజయ్యచౌదరి ఎడ్ల జత 4,097.2 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో, గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం లంకెలకూరపాడుకు చెందిన మెరువ హనిమరెడ్డి, అబ్బూరుకు చెందిన నక్కా పాండురంగయ్య ఎడ్ల జత 3,092.8 అడుగుల దూరం లాగి ఎనిమిదవ స్థానంలో, గుంటూరు రూరల్ మండలం లింగాయపాలేనికి చెందిన తొండపు వెంకటేశ్వర్లు ఎడ్ల జత 3,084.4 అడుగుల దూరం లాగి తొమ్మిదవ స్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.22 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు, రూ.13 వేలు, రూ.10 వేల నగదు బహుమతులను కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్వీఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ద కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.