పకడ్బందీగా సమగ్ర భూసర్వే
జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్
రామభద్రపురం, జనవరి 05 (ప్రజా అమరావతి)
: భూ సమస్యల పరిష్కారం కోసమే, రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పధకాన్ని అమలు చేస్తోందని జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ అన్నారు. ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించాలని కోరారు. భూ సర్వేకు సంబంధించి రాంభద్రాపురం మండలం మర్రివలసలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి బుధవారం జేసీ కిశోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వే అత్యంత ఖచ్చితంగా, పారదర్శకంగా ఉండాలని చెప్పారు. రికార్డులు నమోదు చేసినప్పుడు, నివేదికలను తాయారు చేసినప్పుడు అప్రమత్తంగా ఉండి, తప్పులు దొర్లకుండా చూడాలని సూచించారు. సర్వే చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన, తాసిల్దార్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment