*"కాకాణి చేతులు మీదుగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ"*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలంలోని ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 365 మంది విద్యార్థులకు జామెంట్రీ బాక్స్ లు, పెన్నులు, ప్యాడ్ లు పంపిణీ చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
జగన్మోహన్ రెడ్డి గారు నాడు - నేడు పథకం ద్వారా స్కూళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు.
కరోనా ఉదృతంగా ఉన్నందున పదవ తరగతి విద్యార్థులకు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పరీక్షలు నిర్వహించకుండా ఉత్తీర్ణులు అయినట్లు ప్రకటించారు.
పదవ తరగతి పిల్లలు మరలా అదే విధంగా చదవకుండానే, పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులు అవుతామని భ్రమలో ఉండవద్దు.
పరీక్షలో ఉత్తీర్ణత సాధించకుండా తరగతులు దాటుకుంటూ పోయినా నేటి పోటీ ప్రపంచంలో మనుగడ సాధించడం కష్టం.
ప్రతిభ కలిగిన విద్యార్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి తప్ప, నామమాత్రంగా చదివినవారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
విద్యార్థులు మరలా మూడవ విడత కరోనా నేపథ్యంలో పరీక్షలు లేకుండానే పాస్ అయిపోతామనే ఆలోచన చేయకుండా, పరీక్షలు ఉన్నా, లేకున్నా కష్టపడి చదవడం అలవర్చుకోండి.
తల్లిదండ్రులు బిడ్డలపై పెట్టుకున్న ఆశలు ఒమ్ముకాకుండా చూడడం, మీ కనీస బాధ్యత అని గుర్తుంచుకోండి.
పరీక్షల సమయంలో మీకు అవసరమైన విద్యా సామాగ్రి అందించి, మీకు హితబోధ చేసి, పట్టుదలతో మీరు విద్యను అభ్యసించే విధంగా తయారు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.
సర్వేపల్లి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పథం వైపు పరుగులు తీస్తున్న నేపథ్యంలో విద్యారంగంలో కూడా విద్యార్థులు నియోజకవర్గానికి మంచి గుర్తింపు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
addComments
Post a Comment