మంత్రి కొడాలి నానిపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే తాట తీస్తాం- మంత్రి కొడాలి నానిపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే తాట తీస్తాం 


- గుడివాడ నియోజకవర్గం మంత్రి కొడాలి నాని అడ్డా 

- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మూడెడ్ల ఉమ గుడివాడ, జనవరి 22 (ప్రజా అమరావతి): రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే తాట తీస్తామని శ్రీగౌరీశంకర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు మూడెడ్ల ఉమ హెచ్చరించారు. శనివారం గుడివాడ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని దద్దమ్మలు కూడా నిజ నిర్ధారణ చేయడానికి గుడివాడ వచ్చారన్నారు. గుడివాడ నియోజకవర్గం మంత్రి కొడాలి నాని అడ్డా అని అన్నారు. ఏ ఒక్క కార్యకర్తను టచ్ చేసినా సరైన సమాధానం చెప్పాల్సి వచ్చేదన్నారు. విజయవాడలో సెక్స్ రాకెట్లను నడిపిన వెధవలు కూడా గుడివాడలో మాట్లాడే పరిస్థితికి వచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పేకాట క్లబ్లను నడిపిన వ్యక్తులు అధికారం పోయే సరికి పునీతులయ్యారా అని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నానిని విమర్శిస్తే కార్యకర్తలు సహించరనే విషయాన్ని తెలుసుకుని గుడివాడ రావాలన్నారు. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో గుడివాడకు వస్తే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ బాగోతం అందరికీ తెలుసని అన్నారు. ఇప్పుడిప్పుడే మరిన్ని బాగోతాలు బయటకు వస్తున్నాయన్నారు. బొండా ఉమా చేసే పనులు విజయవాడ నగర వాసులతో పాటు గుడివాడ ప్రజలకు కూడా తెలుసని మూడెడ్ల ఉమ అన్నారు. వైసీపీ నాయకురాలు దేవి మాట్లాడుతూ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో గుడివాడ వచ్చిన నాయకులు ఎక్కడా కన్పించకుండా టీడీపీ కార్యాలయానికే పరిమితమయ్యారన్నారు. గుడివాడ వచ్చే ముందు ఇక్కడ మంత్రి కొడాలి నాని ఉన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజల నెత్తిన ఐపీ పెట్టిన వెధవలు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారన్నారు. చిల్లర వ్యక్తులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. దేవినేని ఉమా చీర కట్టుకున్నా, ప్యాంట్ వేసుకున్నా ఒకేలా ఉంటాడన్నారు. బయటకు ఎందుకు వస్తాడో, ఏమి మాట్లాడతాడో ఎవరికీ తెలియదన్నారు. చంద్రబాబు వయస్సు పెరిగిందని, బుద్ధి మాత్రం రాలేదన్నారు. లోకేష్ ను ఎలా పెంచాలో, రాజకీయాల్లో ఎలా కొనసాగించాలో చంద్రబాబుకు తెలియడం లేదన్నారు. ప్రతిదానికి ఏడవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని అన్నారు. వైసీపీ నాయకురాలు హారిక మాట్లాడుతూ గుడివాడలో మంత్రి కొడాలి ఉండగా ఇక్కడి ప్రజలను భయపెట్టడం ఎవరి తరం కాదన్నారు. మంత్రి కొడాలి నాని దమ్ము చంద్రబాబుకు తెలుసని, అందుకే గుడివాడ రాలేదన్నారు. చెంచాగాళ్ళను పంపాడని, వారి వల్ల ఏమీ కాలేదని చెప్పారు. ఈ సారి చంద్రబాబు, లోకేష్ వస్తే పసుపు, కుంకుమ ఇచ్చి, గాజులు వేసి సాంప్రదాయబద్ధంగా చీరలు, జాకెట్లు కూడా ఇస్తామన్నారు. చంద్రబాబు ఇప్పటికీ ప్రభుత్వంలో ఉన్నట్టుగా నిజ నిర్ధారణ కమిటీ వేశాడని, ప్రతిపక్షంలో ఉన్నపుడు మూసుకుని ఇంటికి పరిమితం కావాలన్నారు. దమ్ముంటే చంద్రబాబు గుడివాడ రావాలన్నారు. మంత్రి కొడాలి నాని గురించి డబ్బా ఛానల్స్ లో  ఇష్టానుసారంగా చర్చలు పెడితే దేహశుద్ధి చేసే వరకు వెళ్తామని హెచ్చరించారు. వైసీపీ నాయకురాలు రమీజా మాట్లాడుతూ టీడీపీ గజ్జి కుక్కలు మంత్రి కొడాలి నానిపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు ఏం చేయాలో తెలియక రావి టెక్స్టైల్స్ లో చీరలు చూసుకుంటూ కాలక్షేపం చేసి వెళ్ళిపోయారన్నారు. గతంలో లోకేష్ స్విమ్మింగ్ పూల్లో మహిళలతో కలిసి ఉన్న ఫొటోలను రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. బాలకృష్ణ కూడా మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడారన్నారు. మంత్రి కొడాలి నానిపై నోరు పారేసుకుంటే బట్టలూడదీసి రోడ్డుపై పరిగెత్తించి కొడతామన్నారు. కే కన్వెన్షన్లో క్యాసినో జరిగినట్టుగా నిరూపిస్తే తాము కూడా పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతామని, మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image