ఒంగోలు (ప్రజా అమరావతి);
ప్రకాశం జిల్లా ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని జిల్లా కలెక్టరు శ్రీ ప్రవీణ్ కుమార్ చెప్పారు
. 73వ భారత గణతంత్ర దినోత్సవం బుధవారం నగరంలోని పోలీసు కవాతు మైదానంలో ఘనంగా జరిగింది. అత్యంత వైభవంగా నిర్వహించిన
వేడుకల్లో ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టరు పాల్గొని ప్రసంగించారు. జాతీయ జెండాను కలెక్టరు
ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనంలో ఎక్కి
జిల్లా కలెక్టరు ప్రవీణ్ కుమార్, ఎస్.పి మలికాగర్గ్ పోలీసు పెరేడ్ ను తిలకించారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖలలో ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులలో 115 మందికి ప్రశంసాపత్రాలు కలెక్టరు అందజేసి వారిని అభినందించారు.
జిల్లా ప్రగతిని చాటుతూ వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన వేడుకల్లో
ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో శకటం, విద్యాశాఖ, ఎస్.ఎస్.ఏ శకటం, డి.ఆర్.డి.ఏ శకటం, గృహనిర్మాణ శాఖ శకటం, డ్వామా శకటం, వైద్య ఆరోగ్య శాఖ శకటం, 108, 104 శకటాలు, పౌర సరఫరాల శాఖ ద్వారా ఇంటి వద్దకే నిత్యవసర సరుకుల పంపిణీ శకటాలు, ప్రదర్శనలో పాల్గొన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చాటేలా శకటాల ప్రదర్శన
కవాతు మైదానంలో అలరించాయి. స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశంపంతులు గారి మనవడు టంగుటూరి గోపాలకృష్ణను డి.ఆర్.ఓ పులి శ్రీనివాసులు గౌరవంగా శాలువకప్పి సత్కరించారు.
ఈ వేడుకలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లాపరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, ఎమ్.ఎల్.సి పోతుల సునీత, జిల్లా సంయుక్త కలెక్టర్లు జె.వెంకటమురళి, టి.ఎస్.చేతన్, కె.కృష్ణ ష్ణవేణి, ఏ.ఎస్.పి చౌడేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
addComments
Post a Comment