దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న గోరుముద్ద పధకం అమలు.అయ్యన్న ఆరోపణలను ఖండించిన విద్యాశాఖ మంత్రి.


దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న గోరుముద్ద పధకం అమలు.

అమరావతి (ప్రజా అమరావతి);

మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించలేదని టీడీపీ నాయకులు అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఖండించారు. మధ్యాహ్న భోజన పధకానికి సంబందించిన బిల్లులు వంటవారికి, గుత్తేదారులకు డిసెంబర్ వరకు పూర్తిగా చెల్లించటం జరిగింది. బిల్లులకు సంబంధించి ఆటో డెబిట్ సిస్టం ద్వారా బిల్లులు అప్లోడ్ చేసిన వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. భారత దేశంలో అతి కొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్రం ఇస్తున్న ఆర్ధిక సహాయంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన వాటా కూడా సింగల్ నోడల్ ఖాతాకు వచ్చిన బిల్లులన్నీ వంటవారి ఖాతాలకు బదిలీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం గోరుముద్దకు సంబంధించిన లావాదేవీలు అన్ని సింగల్ నోడల్ ఖాతాకు బదలాయించి ప్రతినెలా 7 వ తేదీలోగా వంటవారికి, గుత్తేదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో ఎక్కడ లేనివిధంగా వారానికి 5 రోజులు గ్రుడ్లు తో పాటు చిక్కీని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి సురేష్ తెలిపారు.


రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద పధకం అమలు జరుగుతున్న తీరును ఒక ప్రకటన ద్వారా మంత్రి సురేష్ వివరించారు.


రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద పధకాన్ని పూర్తిగా మార్పులు చేస్తూ పిల్లలకు పౌస్టికాహరాన్ని అందించాలని రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని 15 రకాల వంటలతో 6 రోజులపాటు మెనూను తయారు చేయటం జరిగింది. దీనికయ్యే మొత్తంఖర్చు సవరించిన అంచనాల ప్రకారం 1797 కోట్లు. అందులో కేవలం 406 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సహకారం కాగా మిగిలిన దాదాపు 1400 కోట్లు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 88, 296 మంది వంటమనుషులు స్వయం సహాయక గ్రూప్ ల ద్వారా 41 వేల పాఠశాలల్లో పని చేస్తుండగా మరో 4 వేల స్కూల్స్ లో అక్షయపాత్ర, ఇస్కాన్ తదితర ఎన్ జి ఓ ల ద్వారా జగనన్న గోరుముద్ద అందిస్తున్నాం.


రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నాణ్యమైన బియ్యం గోరుముద్ద కోసం ఇవ్వాలని ఆదేశించటం జరిగింది. పిల్లల్లో బలహీనత, ముఖ్యంగా బాలికలకు రక్తహీనత లేకుండా ఉండేందుకు ఐరన్ ఫోలిక్ ఆసిడ్ తో కూడిన బియ్యం సరఫరా చేయాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది.


దేశంలో ఏ రాష్ట్రం లో కూడా చేయని విధంగా ముఖ్యమంత్రి స్వయంగా మెనూను తయారు చేసి పిల్లల పట్ల ఇంతటి శ్రద్ద చూపుతూ పధకాన్ని అమలు చేయటం జరుగుతుంది.


ప్రతి నెల ప్రతి జిల్లాలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు సంబంధిత అధికారులు ఏదో ఒక పాఠశాలలో ప్రత్యక్షంగా పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేయాలని తద్వారా భోజనం లో నాణ్యత ప్రమాణాలు పెరిగేలా ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.


వంటవారికి ఇచ్చే వేతనాలు కూడా 200 శాతం అంటే 1000 రూపాయలు నుంచి 3000 వరకు పెంచి క్రమం తప్పకుండ వారికి కూడా చెల్లించటం జరుగుతుంది.


ఇవేమి తెలియని అయ్యన్న పాత్రుడు భోజన పధకం బిల్లులు చెల్లించటం లేదని చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. అవగాహన లేని అయ్యన్న ఏదో ఒక ఆరోపణ చేయాలని మాట్లాడటం మంచిది కాదన్నారు. టీడీపీ హయాంలో ఉడికి ఉడకని అన్నం, నీళ్ల సాంబార్ పెట్టి పిల్లల పేరుతో నిధులు కాజేసిన పద్ధతి మా ప్రభుత్వానిది కాదని 93 శాతం పిల్లలు చక్కని మెనూ తో కూడిన భోజనం చేస్తున్నారని మంత్రి తెలిపారు.


Comments