సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలి*
*: జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*
*: గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామ సచివాలయం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
గుత్తి (అనంతపురం), జనవరి 05 (ప్రజా అమరావతి):
సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా తమ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం గుత్తి మండలం పరిధిలోని పెద్దొడ్డి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి అవగాహన కల్పించాలని, అర్హులైన వారందరికీ పథకాల లబ్ధి చేకూర్చాలన్నారు. సచివాలయానికి వచ్చే సర్వీసులను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సచివాలయం పరిధిలో 2వ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కరోనా ఓమిక్రాన్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. సచివాలయం పరిధిలో వివిధ శాఖల రెగ్యులర్ యాక్టివిటీలని జాగ్రత్తగా చేపట్టాలన్నారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతినగా వచ్చే వేసవిలో పశువులకు ఎంత పశుగ్రాసం అవసరం అవుతుందో ముందుగానే చూసుకోవాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన పశుగ్రాసం సిద్ధంగా ఉంచాలన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రతి రోజు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాలని, వాలంటీర్ లు వారంలో మూడు రోజులు తప్పనిసరిగా అటెండెన్స్ నమోదు చేయాలన్నారు. సచివాలయంలో అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల పోస్టర్లు ఖచ్చితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, సర్పంచ్ లక్ష్మిదేవి, తహసీల్దార్ హజా వలి, ఎంపిడిఓ శ్రీనివాసులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment