మనసు పెట్టి స్పందన సమస్యలకు పరిష్కారం చూపాలి*మనసు పెట్టి స్పందన సమస్యలకు పరిష్కారం చూపాలి


:-*


*అంతిమంగా అర్జీదారునికి సంతృప్తికరమైన పరిష్కారం లభించాలన్నదే స్పందన లక్ష్యం*


*నెల తర్వాత జిల్లాలో స్పందన సమస్యల పరిష్కారంలో  ప్రజాభిప్రాయం వంద శాతం సంతృప్తికరంగా ఉండాలి*


*సుస్థిర అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలపండి :-*


*ముఖ్య మంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ :-*


కర్నూలు, జనవరి 07 (ప్రజా అమరావతి);

సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి  'స్పందన' కార్యక్రమాన్ని  రూపొందించి,దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.. రేపటి నుంచి స్పందన సమస్యలకు సరైన పద్ధతిలో పరిష్కారం చూపాలి..ఆలోచనా విధానాన్ని   మార్చుకుని, మనసు పెట్టి స్పందన సమస్యలకు పరిష్కారం చూపాలి, అంతిమంగా అర్జీదారునికి సంతృప్తికరమైన పరిష్కారం లభించాలన్నదే స్పందన లక్ష్యం అని ముఖ్య మంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ పేర్కొన్నారు. 


శుక్రవారం ఎంఆర్ సి కన్వెన్షన్ హాల్లో స్పందన కార్యక్రమంపై ఒక్కరోజు జిల్లా స్థాయి కార్యశాల (వర్క్ షాప్) నిర్వహించారు.


స్పందన వర్క్ షాప్ లో ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఎమ్.హరికృష్ణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎం.ఎం నాయక్, గ్రామ, వార్డు సచివాలయం అడిషనల్ కమిషనర్ రామనాద్ రెడ్డి, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ శాంతి ప్రియ పాండే లు హాజరయ్యారు.*ముఖ్యమంత్రి కార్యదర్శి  మాట్లాడుతూ.... స్పందన సమస్యల పరిష్కారం ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలన్నారు..ఫిర్యాదులు రాకుండా  గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థ, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఎంపీడీఓ లు, సంబంధిత శాఖాధికారులు సచివాలయ సిబ్బంది సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు..   స్పందనలో వచ్చిన సమస్యకు ఏదో ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి ముగించడం పద్ధతి కాదన్నారు..సంతృప్తికర పరిష్కారమే అంతిమ లక్ష్యం అన్నారు.  ఫిర్యాదు చేసిన  అర్జీదారుడిని విచారించి, అతని  ప్రమేయంతో పరిష్కారం చూపిస్తే స్పందన పై ప్రజలకు సంతృప్తి కలుగుతుందన్నారు.  పని పూర్తయిన తర్వాత ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు.. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై మండల స్థాయిలో ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలన్నారు. ... డివిజన్, మండల స్థాయిల్లోనూ సమీక్ష జరగాలన్నారు.ఎంపీడీఓ, తహసిల్దార్  ప్రతి రోజూ కనీసం అరగంట పాటు  సమస్యల పరిష్కారంపై సమీక్షించుకోవాలన్నారు. . డ్యాష్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నారా?స్పందన సమస్యలపై సమీక్షిస్తున్నారా లేదా అని తాము పర్యవేక్షిస్తామన్నారు. ఒక నెల తర్వాత జిల్లాలో స్పందన సమస్యల పరిష్కారంలో  ప్రజాభిప్రాయం వంద శాతం సంతృప్తికరంగా ఉండాలన్నారు..స్పందన సమస్యల పరిష్కారం సరైన పద్ధతిలో జరగాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, సీనియర్ అధికారులను ముఖ్యమంత్రి జిల్లాలకు పంపిస్తున్నారంటే ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఉందో అధికారులు అర్థం చేసుకోవాలన్నారు.. ఇకపై  స్పందన లక్ష్యం నెరవేరే లా  ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.


*సుస్థిరాభివృద్ధిలో కర్నూలు జిల్లాను అగ్రగామిలో నిలపాలి* 


 నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం సుస్థిరాభివృద్ధిలో దేశంలో  మన రాష్ట్రం  నాలుగో స్థానంలో ఉందన్నారు..కాగా    కర్నూలు జిల్లా సుస్థిరాభివృద్ధి సూచీలలో వెనకబడిన అంశాలపై దృష్టి సారించి అగ్రగామిగా నిలవాలని ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్య రాజ్ అధికారులను ఆదేశించారు..సుస్థిరాభివృద్ధి సూచీలు 17  ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేరుతో నిర్వహించే అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ వంటి కార్యక్రమాలన్నీ సుస్థిర అభివృద్ధి సూచీలు గా ఉన్నాయన్నారు.. జిల్లాల వారీగా సుస్థిరాభివృద్ధి సూచీలను మెరుగు పరచడం  ద్వారా రాష్ట్ర సుస్థిరాభివృద్ధి అగ్ర స్థానానికి చేరుకుంటుందన్నది  ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నారు. గ్రామ సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రణాళికా బద్ధంగా పని చేసి జిల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్యం చేరుకునేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ముఖ్యమంత్రి కార్యదర్శి అధికారులను ఆదేశించారు..

 

*సమస్య  పరిష్కారం సామాన్యుని హక్కు అన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం - ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఎమ్.హరికృష్ణ :-*


*సమస్య  పరిష్కారం సామాన్యుని హక్కు అన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం  అని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఎమ్.హరికృష్ణ తెలిపారు.. ఎన్నికల ముందు 3,648 కిలోమీటర్ల  సుదీర్ఘ పాదయాత్ర చేసిన సందర్భంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  వేలాది మందిని కలిశారన్నారు..ఈ సందర్భంగా ప్రజలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేక పోతున్నారని భావించి  సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు  అన్ని విధాలుగా అండగా నిలవాలన్న లక్ష్యంతో   ముఖ్యమంత్రి స్పందనకు శ్రీ కారం చుట్టారన్నారు. సీఎం మానస పుత్రిక అయిన స్పందనను  అధికారులు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. సమస్యల పరిష్కారంతో ప్రజలు సంతృప్తి చెందితే అది ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికంగా నిలుస్తుందని చెప్పారు. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొన్నారు. స్పందన  అద్భుతమైన వ్యవస్థని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సూచించారు. ఒక సమస్య వెనుక, అర్జీదారుని  కుటుంబం, వారి జీవితం ఆధారపడి ఉండవచ్చని, ఎలాంటి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులు గుర్తించాలన్నారు. 


*అధికారుల పనితీరు  ప్రభుత్వం పై  ప్రభావం చూపుతుంది-జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-*


ఏ అంశమైనా అధికారుల పని తీరు ప్రభుత్వం పై పడుతుందని, ఉద్యోగులు సక్రమంగా పని చేయకపోతే ప్రభుత్వమే కారణం అన్నట్లు ప్రజలు భావిస్తారని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు పేర్కొంటూ,  సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం  కొరకు  ప్రవేశ పెట్టిన  స్పందన లక్ష్య సాధనకు   అధికారులందరూ చిత్తశుద్ధితో బాధ్యతతో పని చేయాలన్నారు.  గంపెడాశతో  సమస్యల పరిష్కారానికి   వచ్చిన ప్రజలను సాదరంగా మాట్లాడి నిర్దేశిత సమయంలోపు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత సమయంలోపు సమస్య పరిష్కరించినట్లు అర్జీదారులకు విధిగా చెప్పాలన్నారు.  జిల్లాలో స్పందన సమస్యల పరిష్కార వివరాలను   పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు..గ్రామ, సచివాలయ సిబ్బందిపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ఫిర్యాదులు రాకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు . అలాగే సమస్యలు రీ ఓపెన్ కాకుండా  ప్రజలు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు..


*పరిపాలనలో  సమస్యల పరిష్కారం కీలకం- మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎం.ఎం నాయక్ :-*


పరిపాలనలో  సమస్యల పరిష్కారం కీలకం అని పట్టణాల్లో మునిసిపల్ సేవలకు సంబంధించి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని,  స్పందన కార్యక్రమం ద్వారా అందే ఫిర్యాదులకు సరైన విధంగా పరిష్కారాలు చూపాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎం.ఎం నాయక్ అన్నారు. మున్సిపాలిటీ ల్లో స్పందన సమస్యలకు సంబంధించి ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం, నిర్దేశిత గడువు తదితర అంశాల గురించి ఆయన వివరించారు.


అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయం అడిషనల్ కమిషనర్ రామనాద్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన సమస్యల పరిష్కారం,   పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ శాంతి ప్రియ పాండే ఆ శాఖల  సమస్యల పరిష్కారం పై విపులంగా వివరించారు. 


జిల్లా స్థాయి వర్క్ షాప్ లో  హాజరైన జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీ.కే.బాలాజీ, శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్  కలెక్టర్ తమీమ్ అన్సారీయ, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి శ్రీనివాసులు, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, డి ఆర్ ఓ పుల్లయ్య, ఆర్ డి ఓలు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు, తహసీల్దార్ లు, ఎంపీడీఓ లు, గ్రామ/వార్డ్ సచివాలయం మాస్టర్ ట్రైనర్ లు, పాల్గొన్నారు.