రైతు కుటుంబాలతో ఒంగోలు జాతికి అవినాభావ సంబంధం
- రైతు కుటుంబాలతో ఒంగోలు జాతికి అవినాభావ సంబంధం 


- మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని 

- సబ్ జూనియర్స్ విభాగంలో పోటీలు ప్రారంభం గుడివాడ, జనవరి 14 (ప్రజా అమరావతి): పూర్వం ఒంగోలు జాతి పశువులు లేనిదే రైతు లేడని, ఈ జాతి పశు సంపదతో రైతు కుటుంబాలకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) అన్నారు. శుక్రవారం గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీల్లో భాగంగా సబ్ జూనియర్స్ విభాగంలో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, స్టేడియం కమిటీ సభ్యుడు దొప్పలపూడి రవికుమార్ లు పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొనే ఎడ్ల జతల యజమానులకు మెమెంటోలను బహుకరించారు. అనంతరం కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) మాట్లాడుతూ వ్యవసాయంలో పెరుగుతూ వస్తున్న ఆధునిక యాంత్రీకరణ వల్ల ఒంగోలు జాతి పశుసంపద తగ్గిపోతూ వస్తోందని, ఈ జాతిని కాపాడడానికి గత కొన్నేళ్ళుగా తనవంతు కృషి చేస్తున్నానని చెప్పారు. సంక్రాంతి సమయంలో ఎడ్లబండ లాగుడు పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి కూడా ప్రదర్శన పోటీలకు ఎడ్ల జతలు వస్తుంటాయన్నారు. వీటి యజమానులు గెలుపు మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంటారని, ప్రైజ్ మనీ లెక్క కాదన్నారు. కొంత మంది పశుపోషకులు ప్రదర్శన పోటీల సమయం కోసం వేచి చూస్తుంటారని అన్నారు. ఒంగోలు జాతి ఎడ్లు ప్రదర్శన పోటీల్లో విజయకేతనం ఎగురవేసి రైతు ప్రతిష్ఠను కాపాడుతూ, యజమానుల నమ్మకాన్ని నిలబెడుతూ వస్తుంటాయన్నారు. పచ్చని పొలాల్లో మహాలక్ష్మిలా ఈ జాతి పశువులు తిరుగుతుంటాయని, అందరికీ ఆహ్లాదాన్ని పంచుతాయన్నారు. కొంత మంది రైతులు ఒంగోలు జాతి ఆవులను పూజించడం వంటివి చేస్తూ పిల్లల్లా కాపాడుకుంటున్నారన్నారు. ఒంగోలు జాతి ఆవులకు పాలధార ఎక్కువగా ఉంటుందని, ఏ సమయంలో పితికినా పాలు వస్తాయని, వీటిలో పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయన్నారు. ఒంగోలు జాతి పశుసంపదను మరింత వృద్ధి చేసేందుకు పశు పోషకులంతా కృషి చేయాలని కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్చర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్విఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి , పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.