యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి.



*యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి.


*


*నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు....యూనివర్సిటీ నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను.*


అమరావతి (ప్రజా అమరావతి): యువత, నిపుణులు రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నేటి పరిస్థితుల్లో రాజకీయల పట్ల యువత ఆసక్తి చూపడం లేదని చంద్రబాబు అన్నారు. విద్యార్థులు సైతం రాజకీయలను, నేతలను స్టడీ చెయ్యాలని.....పబ్లిక్ పాలసీలు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని చంద్రబాబు తెలిపారు. తనకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని....యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా పని చేసి తరువాత రాజకీయాల్లో ఎదిగానని చంద్రబాబు అన్నారు. నేటి రాజకీయాలను, నేతలను చూసి యువత మా ఖర్మ అనుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


తెలుగు దేశం పార్టీలో ఇంటర్న్ షిప్ చేసిన 28 మంది విద్యార్థులు, నిపుణులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిశారు.  రెండు నెలల పాటు పార్టీలోని వివిధ విభాగాల్లో, వివిధ అంశాలపై తాము చేసిన పరిశోధనను నివేదిక రూపంలో పార్టీకి అందించారు. రీసెర్చ్, క్యాపెయిన్, మీడియా, క్రియేటివ్ విభాగాల్లో వీరు పరిశీలన జరిపి నివేదిక ఇచ్చారు. రెండు నెలల పాటు ఇంటర్న్ షిప్ చేసిన 28 మంది ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్లను చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో కొద్ది సేపు ముచ్చటించారు. విద్యార్థులు, యువత ఒక గమ్యంతో పని చెయ్యాలని సూచించారు. ఈ టీం అందించిన నివేదకను పార్టీ లో చర్చిస్తామని చంద్రబాబు తెలిపారు.

Comments