పేదల ఆరోగ్యానికి పెద్దపీట.

 పేదల ఆరోగ్యానికి పెద్దపీట.



రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.


పలాస ప్రభుత్వ ఆసుపత్రులో ఆక్సిజన్ ప్లాంటు ప్రారంభం.


వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం జగన్. 


పలాస (ప్రజా అమరావతి);


పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌  మాట్లాడుతూ.. 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నామని​ తెలిపారు. మనమే సొంతంగా ఆక్సిజన్‌ సరఫలా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 100 పడకలు ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లపై 30 శాతం సబ్సిడీ అందిస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంట్ కూడా ప్రారంభించుకున్నామని  తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ

 ప్రభుత్వం సొంతంగా

ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌ సౌలభ్యం అందిస్తున్నామని చెప్పారు. ఒక్కో ప్లాంట్‌లో నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. అదేవిధంగా కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ విమానాల్లో తెచ్చుకోవాల్సిన పరిసస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం మనమే సొంతంగా ఆక్సిజన్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కోవిడ్‌ పరిస్థితుల్లోనూ వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలాస ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆసుపత్రి సిబ్బంది, పలువురు కౌన్సిలర్ లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments