-కే. కన్వెన్షన్ జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలు



- కే. కన్వెన్షన్ జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలు 


- ప్రారంభించిన మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని 



గుడివాడ, జనవరి 11 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్లో ఐదు రోజుల పాటు జరిగే జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలను మంగళవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మొదటగా రెండు పళ్ళ విభాగంలో పోటీ పడుతున్న ఒంగోలు జాతి ఎడ్ల జత యజమాని రాజంపేటకు చెందిన గొర్ల శివన్నారాయణకు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) మెమెంటోను బహుకరించారు. ఈ సందర్భంగా కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) మాట్లాడుతూ ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ను నెలకొల్పి గత ఐదేళ్ళుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారాల రీత్యా అనేక కారణాలతో గ్రామాలను వదిలి పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన తెలుగువారంతా సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు చేరుకుంటారన్నారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, స్నేహితులతో గడపాలనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారన్నారు. రాష్ట్రంలో ఒంగోలు జాతి పశు సంపదకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. ఈ జాతి పశువులను పరిరక్షించేందుకు తన సోదరుడు కొడాలి నానితో కలిసి ప్రతి ఏటా జాతీయస్థాయిలో ప్రదర్శన పోటీలను జరుపుతున్నామన్నారు. వ్యవసాయంలో నిమగ్నమైన పశువులను కూడా దృష్టిలో పెట్టుకుని సేద్య విభాగంలో కూడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు పళ్లు, నాలుగు పళ్ళు, ఆరు పళ్ళు, సేద్య, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో మొదటి తొమ్మిది స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ.18.40 లక్షల నగదు బహుమతులను అందజేస్తున్నామన్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండి ఈ పోటీలకు పెద్దఎత్తున ఎడ్ల జతలు వస్తున్నాయని, వీటి యజమానులకు కూడా భోజన, వసతి సౌకర్యాలను కల్పించామన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే లక్షలాది మంది పశు పోషకులు, రైతులు, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పోటీల విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) విజ్ఞప్తి చేశారు. అనంతరం కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) కు వ్యాయామ ఉపాధ్యాయుడు కోటే రత్నదాస్ పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్వీఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Comments