గుంక‌లాం లేఅవుట్‌ను ప‌రిశీలించిన జెసి కిశోర్‌గుంక‌లాం లేఅవుట్‌ను ప‌రిశీలించిన జెసి కిశోర్‌విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 02 (ప్రజా అమరావతి) ః

          విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ పేద‌ల‌కోసం గుంక‌లాం వ‌ద్ద రూపొందించిన హౌసింగ్ లేఅవుట్‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్‌కుమార్ ఆదివారం ప‌రిశీలించారు. ఈ లేఅవుట్‌లో సుమారు 12వేల ఇళ్ల ప‌ట్టాల‌ను, రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి చేతుల‌మీదుగా పంపిణీ చేసిన విష‌యం తెలిసిందే. లేఅవుట్‌లో గృహ‌నిర్మాణ ప్ర‌గ‌తిని, క‌ల్పించిన స‌దుపాయాల‌ను ప‌రిశీలించారు. ల‌బ్దిదారుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. ఇసుక స‌ర‌ఫ‌రాపై ఆరా తీశారు. లేఅవుట్ చేరుకోవ‌డానికి ఉన్న అప్రోచ్‌రోడ్లు, అంత‌ర్గ‌త ర‌హ‌దారుల ప‌రిస్థితిపై స‌మీక్షించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో విజ‌య‌న‌గ‌రం తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర‌రావు పాల్గొన్నారు.