త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కేంద్ర ఎన్నికల పరిశీలకులు గా వెళ్ళనున్న ఐఏఎస్,ఐపిఎస్ అధికారులకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర చే వర్చువల్ బ్రీఫింగ్ కార్యక్రమం.
అమరావతి,14 జనవరి (ప్రజా అమరావతి): త్వరలో జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్, మణిపూర్,గోవా రాష్ర్టాల అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళనున్న 35మంది ఐఏఎస్,9 మంది ఐపిఎస్ అధికారులకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర గురువారం ఢిల్లీ నుండి వర్చువల్ బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు.అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులోని కలెక్టర్లు సమావేశ మందిరం నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మరియు ఎక్స్ అఫీసియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తోపాటు ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళనున్న 35 మంది ఐఏఎస్,9 మంది ఐపిఎస్ అధికారులు పాల్గొన్నారు.ఈసందర్భంగా రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల పరిశీలకులు గా అనుసరించాల్సిన విధి విధానాలు ఇతర మార్గదర్శకాలను గురించి సిఇసి సుశీల్ చంద్ర ఈవర్చువల్ బ్రీఫింగ్ కార్యక్రమంలో వివరించారు.
ఈసందర్భంగా ఎన్నికల పరిశీలకులుగా వెళుతున్న అధికారులు అందరికీ కోవిడ్ బూస్టర్ ను అందించారు.
addComments
Post a Comment