బుద్దా వెంకన్నక చంద్రబాబు ఏం నేర్పించాడో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది- బుద్దా వెంకన్నక చంద్రబాబు ఏం నేర్పించాడో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది


- ఒక వర్గం నేతలు మంత్రి కొడాలి నానిపై కత్తి గట్టారు

- ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ నారాయణరెడ్డిగుడివాడ, జనవరి 25 (ప్రజా అమరావతి): బుద్ధా వెంకన్నకు చంద్రబాబు ఏం నేర్పించాడో రాష్ట్ర ప్రజలకు అర్ధమైందని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం గుడివాడ లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ, బీజేపీ పార్టీల్లోని ఒక వర్గానికి చెందిన నాయకులు మంత్రి కొడాలి నానిపై కత్తి కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడును ఆస్థిగా భావించే వీరంతా మంత్రి కొడాలి నానిని లక్ష్యంగా చేసుకున్నారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి క్యారెక్టర్ను పదే పదే దెబ్బతీస్తూ వస్తున్న చంద్రబాబును మంత్రి కొడాలి నాని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారన్నారు. గుడివాడలో మూడు రోజుల పాటు కేసినో జరిగిందని చెబుతున్న టీడీపీ నేతలు ఆ సమయంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గుడివాడ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారని, జరుగుతున్నపుడు ఆపొచ్చు కదా అని అన్నారు. చంద్రబాబు చెప్పే అబద్దాలను సీపీఎం, సీపీఐలు కూడా జై కొడుతున్నారన్నారు. వెంటనే సోము వీర్రాజు కూడా జేజేలు పలుకుతాడన్నారు. సీఎం జగన్, మంత్రి కొడాలి నానిపై ఇంత వ్యక్తిగత ద్వేషం చూపడమెందుకని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పార్టీకి బీ టీంగా పనిచేస్తోందన్నారు. ప్రత్యేక హెూదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయాలపై మాట్లాడలేని బీజేపీ నేతలు ఏ విధంగా ప్రజల్లోకి వస్తారని అన్నారు. బతికినంత కాలం మంచి పనులు చేయాలని, కుట్రలు చేయవద్దని చంద్రబాబుకు నారాయణరెడ్డి సూచించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, నాయకులు లోయ రాజేష్, తోట నాగరాజు, గూడపాటి వెంకటేశ్వరరావు, వెంపటి సైమన్, చింతల భాస్కరరావు, కొంకితల ఆంజనేయప్రసాద్, రేమల్లి పసి, మేకల సత్యనారాయణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments