కార్పొరేషన్ ఫలితాలతో సింహపురి వైసీపీపురిగా మారింది : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి




ఆత్మకూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);


*కార్పొరేషన్ ఫలితాలతో సింహపురి వైసీపీపురిగా మారింది : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*



సాధారణ ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్


 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో  రెండున్నరేళ్ల పరిపాలన తర్వాత కూడా ప్రజలంతా ఒకే వైపున ఉన్నారనడానికి ఫలితాలే నిదర్శనం


విజయం సాధించిన 54మంది కార్పొరేటర్లకు అభినందనలు, ప్రజలు ఇచ్చిన ఈ అవకాశంతో మరింత ప్రజా సేవ చేయండి


ఎవరి ముందైనా అది ఏ అంశమైనా సూటిగా స్పష్టంగా తప్పొప్పులు చెప్పడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిలో నాకు నచ్చే మంచి గుణం


2009 నుంచి వేమిరెడ్డిగారితో నాకు అనుబంధం


జిల్లా, పార్టీ, రాష్ట్రానికి వేమిరెడ్డిగారు చేస్తున్న సేవలు అనిర్వచనీయం


బ్లాక్ , వైట్ తప్ప గ్రే ఏరియా ఎరుగని మనిషి వేమిరెడ్డిగారు


రాబోయే రెండున్నరేళ్లతో పాటు, ఆ తర్వాత వచ్చే ఐదేళ్లలో కూడా ఎలా రాష్ట్రాన్ని సకల సదుపాయాలతో అభివృద్ధి చేయాలో సీఎం ఆలోచనల పక్కా ప్లాన్ సిద్ధం


ఐకమత్యమే మనందరి బలం


కలిసి ఉండడమే మన అస్త్రం


నెల్లూరు జిల్లా వీపీఆర్ కన్వెన్షన్ వేదికగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన అభినందన, ఆత్మీయ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు


ఈ కార్యక్రమానికి హాజరైన నీటిపారుదల శాఖ మంత్రి  పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్,రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , నెల్లూరు రూరల్ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ,నగర వైసిపి పార్టీ అధ్యక్షులు తాటికొండ వెంకటేశ్వర్లు గారు, నెల్లూరు మేయర్ గారు,డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్ గారు,డిప్యూటీ మేయర్ మొహమ్మద్ ఖలీల్ గారు నుడా చైర్మన్ ద్వారక నాథ్ గారు,నెల్లూరు నగర పాలక కమీషనర్ దినేష్  తదితరులు.


Comments