చిత్తూరు, జనవరి 8 : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), కె.నారాయణ స్వామి ఇరువురు కలిసి శనివారం ఉదయం గంగాధర నెల్లూరు నియోజక వర్గంలోని కార్వేటి నగరం, పెనుమూరు మండలాలలో పర్యటించి రెండు సామాజిక ఆరోగ్య కేంద్రములాలో ఒక్కొక్కటి రూ.13.05 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు శంఖుస్థాపన
లు చేశారు. ఇందులో సివిల్ వర్క్స్ కొరకు రూ.12.60 కోట్లు, ఆసుపత్రి పరికరాలకు కొరకు రూ. 45 లక్షల అంచనాతో ప్రభుత్వం మంజూరు ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లలో 50 బెడ్ లకు సరిపడా వార్డులు, క్యాజువాలిటీ, రెండు మేజర్ ఆపరేషన్ ధియేటర్లు, ఒక మైనర్ ఆపరేషన్ దియేటర్, నాలుగు పోస్టు ఆపరేటివ్ రికవరీ బెడ్స్, డాక్టర్ల కొరకు 5 గదులు, ఆయుష్ క్లినిక్, ఎక్స్ రే మరియు ల్యాబ్ రూములు ఏర్పాటు చేయనున్నారు. ఈ భవన నిర్మాణాలు 15 నెలలో పూర్తి కాగలదని అంచనా, ఈ శంఖుస్థాపన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులను సాధరంగా అధికార, అనధికారులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, సత్యవేడు, చిత్తూరు ఎమ్మెల్యేలు ఆదిమూలం, ఆరణి శ్రీనివాసులు, ఆర్టీసీ చైర్మన్ విజయానంద రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి, చిత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ , ఎస్పీ సెంథిల్ కుమార్, జాయింట్ కలెక్టర్ అభివృద్ధి శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.శ్రీహరి, డి సి హెచ్ ఎస్ సరళమ్మ, ఇమ్యునైజేషన్ అధికారి శ్రీనివాసరావు తదితర అధికార, అనధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు
ఉపముఖ్యమంత్రి వర్యులు కార్వేటినగరం, పెనుమూరు మండలాలలో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
addComments
Post a Comment