నియోజకవర్గంలో రెండు రోజుల ముందే సంక్రాంతి సంబరాల సందడి చేయించిన నారా లోకేష్

 మంగళగిరి నియోజకవర్గంలో రెండు రోజుల ముందే సంక్రాంతి సంబరాల సందడి చేయించిన నారా లోకేష్.




మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో నాగార్జున హై స్కూల్ గ్రౌండ్ లో నారా లోకేష్ గారి సహకారంతో తెలుగు మహిళ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగినది


బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు రాత్రి 10 గంటల వరకు జరుగగా , ఈ సంబరాల్లో భాగంగా నియోజకవర్గ స్థాయిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి  బహుమతులను ప్రధానం చేశారు


ముగ్గుల పోటీలలో జూనియర్ మరియు  సీనియర్ విభాగాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించగా, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్ తదితర ఆటల పోటీలు నిర్వహించి పోటీలలో గెలిచిన మొదటి మూడు స్థానాలకు బహుమతులను అందజేయగా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి అందచేయించిన నారా లోకేష్ గారు


నియోజకవర్గ తెలుగు మహిళ ఆధ్వర్యంలో పెదవడ్లపూడి నాగార్జున హై స్కూల్ ప్రాంగణంలో లో జరిగిన ఈ సంక్రాంతి సంబరాలలో కోలాటం, ఎడ్లబండ్లు, సంక్రాంతి గంగిరెద్దులు, పొటేళ్ళు, కోడిపుంజులు,బోగి మంటలు, బోగి పళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి


కరోనా కాలంలో విసిగివేసారిన మహిళలకు చిన్న పిల్లలకు ఆటవిడుపుగా ఉండాలనే లక్ష్యంతో తలపెట్టిన ఈ సంక్రాంతి సంబరాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగాయి


నియోజకవర్గ తెలుగు మహిళ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాలలో, రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గ పట్టణ మండల స్థాయి టిడిపి నాయకులతో పాటు రాష్ట్ర తెలుగుమహిళ ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి,పోలుమట్ల  స్వతంత్ర భారతీ, ఉన్నం ఝాన్సీ రాణి, నియోజకవర్గ తెలుగు మహిళ కమిటీ సభ్యులు పత్తిరిపల్లి కృష్ణవేణి, కట్టెపోగు రత్నమాణిక్యం, వాసిరెడ్డి లక్ష్మి దేవి, మరియు కమిటీ సభ్యులు మద్దిసాని ఈశ్వరి,ఎలమంచిలి పద్మజ, తోటా భూలక్ష్మి, మొండితోక కళ్యాణి, దివ్వెల కనకదుర్గ,మంగళగిరి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి, తాడేపల్లి పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నెం కుసుమ, దుగ్గిరాల మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు తోట భూలక్ష్మి, తాడేపల్లి మండలం తెలుగు మహిళ అధ్యక్షురాలు  బొర్ర కృష్ణ వందన, మంగళగిరి మండలం తెలుగు మహిళ అధ్యక్షురాలు  అపర్ణ, పెదవడ్లపూడి గ్రామ మహిళా అధ్యక్షురాలు వడ్లమూడి యువరాణి తదితరులు పాల్గొన్నారు.

Comments