కోవిడ్ అంతరించి అందరూ ఆనందంగా ఉండాలి
జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు
ఘనంగా సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి వైభవాన్ని చాటి చెప్పేలా పలు
కార్యక్రమాలు
విజయనగరం, జనవరి 13:(ప్రజా అమరావతి): ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా తమ స్వంత గ్రామాలకు వచ్చి సంబరంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని, అందరిని కలిపి వైషమ్యాలను దూరం చేసే ఈ పండగ అందరికి సంతోషాన్ని ఇవ్వాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు. తుఫాన్ తో ఎంతో ఆందోళనల మధ్య రైతుకు పంట చేతికి వచ్చిందని, ఇది రైతు పండగ అని అన్నారు. గురువారం కాలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతి వేడుకల్లో కనపడే మన సంప్రదాయాలు, సంస్కృతి భవిష్యత్తు లో కొనసాగలంటే పిల్లలందరూ ఇందులో భాగస్వాములు కావాలన్నారు.
ఈ ఏడాది కోవిడ్ మధ్య వేడుకలు నిర్వహించుకుంటున్నామని, త్వరలో కోవిడ్ అంతం జరిగి ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన గో పూజలను, ఎడ్ల బండ్లను, సంప్రదాయ గ్రామీణ క్రీడలను చైర్మన్ వీక్షించారు.
నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకు కట్టేలా చూపించారని, ప్రతి ఒక్కరూ పండగ ఆనందంగా జరుపు కోవాలని అన్నారు. ఇంచార్జ్ కలెక్టర్ డా జి సి కిషోర్ కుమార్ మాట్లాడుతూ అన్ని రకాల విశిష్టతలను కలిగి ఉన్న ఏకైక పండగ సంక్రాంతి యని, కుటుంభ సభ్యుల్నుఅందరిని కలిపి సందడి చేసే ఈ పండగ భోగ భాగ్యాలను ప్రసాదించాలని అన్నారు. ఈ కార్య క్రమం లో జె.సి ఆసరా జె.వెంకటరావు, డి.ఆర్.ఓ. ఎం.గణపతిరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
👉 ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు:
సంక్రాంతి సంబరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రంగవల్లులు హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, జంగమ దేవరల మేలుకొలుపు పాటలు, బుడబుక్కల సవ్వడి, సంప్రదాయ బద్ధంగా జరిగిన సంబరాలు , చెరకు, అరటి, మామిడి, పూల తోరణాలతో అలంకరించిన వేదిక శోభాయమానంగా వెలుగుతూ సంక్రాంతి వైభవాన్ని చాటి చెప్పాయి. వీటి తో పాటు విద్యార్ధినుల నృత్య ప్రదర్శనలు సంక్రాంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి పండగ పై చేసిన ప్రత్యేక నృత్యాలు అబ్బుర పరచాయి.
తెలుగు సంప్రదాయ వస్త్రధారణ తో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న జిల్లా అధికారులు మరింత శోభను చేకూర్చారు.
addComments
Post a Comment