టీడీపీ, తోక పార్టీలు చెప్పే అభూత కల్పనలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు- టీడీపీ, తోక పార్టీలు చెప్పే అభూత కల్పనలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు


- గుడివాడలో విద్వేషాలను రెచ్చగొట్టొద్దు

- మంత్రి కొడాలి వెన్నంటే నియోజకవర్గ ప్రజలు

- వైసీపీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీనుగుడివాడ, జనవరి 25 (ప్రజా అమరావతి): టీడీపీ, దాని తోక పార్టీలు చెప్పే అభూత కల్పనలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను అన్నారు. మంగళవారం గుడివాడ లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గుడివాడలో కేసినో జరిగిందని బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వాములుగా ఉన్నారని, అప్పట్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రికార్డింగ్ డ్యాన్స్లు, అర్ధనగ్న నృత్యాలు చేయడం రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలికే పార్టీగా బీజేపీ మిగిలిందన్నారు. చంద్రబాబు కనుసన్నల్లో సోము వీర్రాజు పనిచేస్తున్నాడన్నారు. దీనిలో భాగంగానే గుడివాడలో సంక్రాంతి సంబరాల గురించి సోము వీర్రాజు చెబుతానంటున్నాడన్నారు. సంక్రాంతి సంబరాలంటే మాకు కూడా తెలుసని చెప్పారు. గత ఐదేళ్ళుగా కే కన్వెన్షన్ నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. జాతీయస్థాయిలో ఒంగోలు జాతి ఎడ్లబండ లాగుడు పోటీలను మంత్రి కొడాలి నాని, ఆయన సోదరుడు కొడాలి చిన్నిలు నిర్వహిస్తూ పశుపోషకులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. దేశంలో కేసినో, చీర్ గర్ల్స్, కాల్ గర్ల్స్ పెట్టింది పేరు గోవా రాష్ట్రమని చెప్పారు. గోవాతో పాటు కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉందని తెలిపారు. భారత సంస్కృతి, సాంప్రదాయాలను గురించి పదేపదే చెప్పే బీజేపీ గోవాలో విష సంస్కృతిని ఎందుకు అరికట్టదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు చెప్పిన మాటలు విని, ఎల్లో మీడియా ప్రసారాలను నమ్మి గుడివాడ వస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విజయవాడలో ఊర కుక్క మంత్రి కొడాలి నాని గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా గుడివాడలో కనీసం అడుగు పెట్టలేకపోయాడన్నారు. మంత్రి కొడాలి నానిపై అర్ధం లేని విమర్శలు, ఆరోపణలు చేస్తే వీధి కుక్కలను కొట్టినట్టుగా తరిమికొట్టాల్సి ఉంటుందన్నారు. ఒకప్పుడు బీసీలు టీడీపీకి వెన్నుముకగా ఉండేవారని తెలిపారు. దివంగత రాజశేఖరరెడ్డి, సీఎం జగన్మోహనరెడ్డిలు బీసీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చారన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేశారన్నారు. మంత్రి కొడాలి నాని కూడా జగన్ ఆశయాలకనుగుణంగా అన్ని పదవుల్లో సగానికి పైగా బీసీలకు కేటాయించారని చెప్పారు. బీసీలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని తెలిపారు. బీసీ డిక్లరేషన్కు అనుగుణంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారన్నారు. మంత్రి కొడాలి నాని అంటే ఏంటో గుడివాడ ప్రజలకు తెలియడం వల్లే వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెల్పిస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న గుడివాడలో విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. రాజకీయంగా లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నాలను సమర్ధంగా తిప్పికొడతామన్నారు. మంత్రి కొడాలి నాని వెంటే గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఉన్నారని గొర్ల శ్రీను చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, నాయకులు లోయ రాజేష్, తోట నాగరాజు, గూడపాటి వెంకటేశ్వరరావు, వెంపటి సైమన్, చింతల భాస్కరరావు, కొంకితల ఆంజనేయప్రసాద్, రేమల్లి పసి, మేకల సత్యనారాయణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments