ఎన్టీఆర్ నిలబెట్టిన అభ్యర్ధి చేతిలో ఓటమి పాలైన చిన్న మిడత చంద్రబాబు



- ఎన్టీఆర్ నిలబెట్టిన అభ్యర్ధి చేతిలో ఓటమి పాలైన చిన్న మిడత చంద్రబాబు


- సైకిల్ గుర్తు కోసం లుచ్ఛా పనులన్నీ చేశాడు

- మహిళలను కూడా అడ్డం పెట్టుకుంటున్నాడు

- దశాలల నుండి డబ్బులు వసూలు చేశాడు

- చంద్రగిరిలో వాటిని నడిపాడని నిరూపిస్తా

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని



అమరావతి, జనవరి 25 (ప్రజా అమరావతి): ఎన్టీఆర్ నిలబెట్టిన అభ్యర్థి చేతిలో ఓటమి పాలైన చిన్న మిడత చంద్రబాబు అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. మంగళవారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అబద్దాలు, వెన్నుపోట్లు, 40 పనులపై ఆధారపడి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. చంద్రబాబు జీవిత చరిత్ర చూస్తే కాంగ్రెస్లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అదే పార్టీ నుండి పోటీ చేశారన్నారు. కుటుంబ జీవితం, విలువలు చంద్రబాబుకు తెలిసి ఉంటే ఎన్టీఆర్తో కలిసి ఉండేవారన్నారు. కుటుంబం, బంధాలు అవసరం లేదనుకుని రాజకీయాలే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్టీఆర్పై పోటీ చేస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికాడన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు బీ ఫారం ఇచ్చి, మంత్రిని చేసిందనే స్పృహ లేకుండా ఓడిన 24 గంటల్లోనే ఆ పార్టీని వదిలి పెట్టాడన్నారు. ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన కాళ్ళు పట్టుకుని టీడీపీలోకి వచ్చిన నీచుడు చంద్రబాబు అని అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మూడుసార్లు చంద్రబాబు బీ ఫారం ఇచ్చారన్నారు. చంద్రగిరిలో గెలవనని కుప్పం వెళ్ళి అక్కడ గెల్చాడన్నారు. ఎన్టీఆర్ ఒక ఆడదానికి టీడీపీని అప్పజెప్పాడని, ఆయన స్త్రీ లోలుడని నీచాతి నీచమైన ఆరోపణలు చేశాడన్నారు. • ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని, సీఎం పదవిని లాక్కుని మెడ పట్టి బయటకు గెంటాడన్నారు. ఆడదాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీని దొంగిలించిన దొంగ చంద్రబాబు అని అన్నారు. సైకిల్ గుర్తు కోసం చంద్రబాబు ఎటువంటి లుచ్ఛా పనులు చేశాడో, ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని సైకిల్ గుర్తు తెచ్చుకున్నాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు. రాజకీయంగా మరింత దిగజారి సీఎం జగన్మోహనరెడ్డిని చూసి తట్టుకోలేక, పై చేయి సాధించలేక హీనంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. ఎక్కడో అన్న మాటలను అసెంబ్లీలో అన్నట్టుగా భార్యను అల్లలల్లరి చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించిన నీచుడు చంద్రబాబు అని అన్నారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు మహిళలను కూడా అడ్డం పెట్టుకుంటాడన్నారు. మామకు వెన్నుపోటు పొడుస్తాడని, బావమరుదులు చవటలు, ఎందుకూ పనికిరారని డబ్బా మీడియాతో అల్లరి చేయిస్తాడన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో క్లబ్లను ఏర్పాటు చేశాడన్నారు. జూదశాలల నుండి డబ్బులను వసూలు చేశాడన్నారు. కే కన్వెన్షన్లో కేసినో పెట్టారని, మహిళలతో డ్యాన్స్లు వేయించారని, వ్యభిచారం చేయించాడని 420 గాళ్ళతో చంద్రబాబు ఆరోపణలు చేయించాడన్నారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో కే కన్వెన్షన్లో కేసినో జరగలేదని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని చస్తానని సవాల్ చేస్తే పెట్రోల్ క్యాన్లు పెట్టి కామెడీగా మార్చి తప్పించుకునే ప్రయత్నం చేసిన నీచుడు చంద్రబాబు అని అన్నారు. కే కన్వెన్షన్ తీసి కే కన్వెన్షన్ సమీపానికి వచ్చారని, ఆ తర్వాత గుడివాడలో జరిగిందని చెబుతున్నారన్నారు. చంద్రగిరిలో చంద్రబాబు ఎమ్మెల్యే అయినపుడు జూదశాలలు, వేశ్య శాలలను నడిపాడని నిరూపిస్తానని మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు.

Comments