గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం డైరీని ఆవిష్కరించిన మంత్రి కొడాలి నాని- గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం డైరీని ఆవిష్కరించిన మంత్రి కొడాలి నాని 


- స్టేడియం కమిటీ సభ్యుల మన సత్కారం గుడివాడ, జనవరి 6 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ముద్రించిన 2022 నూతన సంవత్సర డైరీని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆవిష్కరించారు. గురువారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్ నూతన సంవత్సర డైరీలను మంత్రి కొడాలి నానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ . ఎన్టీఆర్ స్టేడియం గుడివాడ పట్టణ, పరిసర ప్రాంత క్రీడాకారులకు వరమని అన్నారు. ఎంతో ముందు చూపుతో స్టేడియాన్ని దివంగత ఎన్టీఆర్ నిర్మించారని తెలిపారు. గుడివాడ ప్రాంతం నుండి ఎంతో మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణిస్తున్నారని చెప్పారు. క్రీడల అభివృద్ధికి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ చేస్తున్న కృషిని అభినందించారు. ప్రతి ఏటా నూతన సంవత్సర డైరీని ముద్రించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ డైరీని తన చేతులమీదుగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి కొడాలి నాని చెప్పారు. స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి మాట్లాడుతూ ప్రతిభ కల్గిన క్రీడాకారులను స్టేడియం కమిటీ ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ సభ్యులు దొప్పలపూడి రవికుమార్, నెరుసు శేషగిరి, బొగ్గరపు తిరుపతయ్య, చింతా రఘుబాబు, స్టేడియం మేనేజర్ ఎం సత్యనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ మీర్ రహ్మత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.