గుంటూరు (ప్రజా అమరావతి); ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా బొకేలతో సత్కరించి తదుపరి నగర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై వినతి పత్రం సమర్పిస్తున్న గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కావటి_శివ నాగ మనోహర్ నాయుడు, మరియు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ .
గుంటూరు నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టులు అయిన SE, CP, టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్,మున్సిపల్ హెల్త్ ఆఫీసర్,మరియు ఇతర పోస్టులను వెంటనే నియామకం చేయాలని,అలాగే నూతనంగా CE పోస్ట్ ను నూతనంగా మంజూరు చేయాలని కోరారు.
గుంటూరు నగరంలో ప్రతిష్టాత్మకంగా 163.61 కోట్లతో G±8 ఫ్లోర్ లతో మోడల్ వెజిటేరియన్ మార్కెట్ మల్టీ లెవల్ పార్కింగ్ తో నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ అయిన PVK నాయుడు మార్కెట్ నిర్మాణానికి
అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు మంజూరు చేసి,శంకుస్థాపనకు గుంటూరు రావాలని కోరారు.
గుంటూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అసంపూర్తిగా నిర్వహించారని దాని పూర్తి విలువ 1082.82 కాగా ఇప్పటికీ 513.13 కోట్లతో పనులు నిర్వహించారని, మిగిలిన 570.69 కోట్ల బ్యాలెన్స్ నిధులు మంజూరు చేసి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
గుంటూరు నగరంలోని శ్రీమతి కాసు శాయమ్మ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల1965 నందు ఏర్పాటు చేశారని, సదరు పాఠశాల నందు 400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,సదరు పాఠశాల స్థలం దేవాదాయ శాఖకు సంబంధించింది అయినందున,తరచుగా స్థల వివాదాలు అవుతున్నాయని,సదరు స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కు కేటాయించినట్లు అయితే, విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నగరపాలక సంస్థకు చెందిన 55 కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ ల యందు 1156 షాపులు ఉన్నాయని, సదరు షాపులలో సబ్ లీజు మరియు లీజు దారుడు చనిపోతే వారి కుటంబసభ్యులు సదరు వ్యాపారం నిర్వహిస్తున్న వారికి రెగ్యులర్ చేయాలని కోరారు.
గుంటూరు నగరంలో శంకర్ విలాస్ నందు నందివెలుగు రోడ్డు నందు ROB లు నిర్మించుటకు,శ్యామల నగర్, మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు,సంజీవయ్య నగర్ ల యందు RUB లను త్వరితగతిన నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని కోరారు.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా గుంటూరు నగరానికి కేటాయించిన 224 ఈ ఆటోలను త్వరితగతిన అందజేయాలని, అలాగే రోజుకు 12 వందల టన్నుల చెత్తతో విద్యుత్తును ఉత్పత్తి చేయు జిందాల్ WASTE TO ENERGY ప్లాంట్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నందున,సదరు ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో KVP కాలనీ,శారదా కాలనీ, వెంగళరావు నగర్,స్వర్ణ భారతి నగర్ తదితర ప్రాంతాల యందు బి. ఫారాల స్థలాల యందు ప్రజల నివాసం ఉంటున్నారని,సదరు స్థలాలను రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు.
సదరు విషయాల పై సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పనులు నిర్వహించుటకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
addComments
Post a Comment