గతంలో జన్మభూమి కమిటీ ల పేరుతో వారికి మద్దతు తెలిపే varike పెన్షన్లు ఇచ్చేవారన్నారు



చాగల్లు (ప్రజా అమరావతి);  


సామాజిక భద్రత కోసం వైఎస్సార్ పెన్షన్ కానుక ను జనవరి నుంచి రూ.2500 లకు పెంచి చాగల్లు మండలం లో మొత్తం 8919 మందికి రూ.224.43 లక్షలు మేర పంపిణీ చెయ్యడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.


సోమవారం చాగల్లు లో వైఎస్సార్ కానుక పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితర కేటగిరి ల్లో  ఇప్పటి వరకు ఇస్తున్న రూ.2250 పెన్షన్ న్నీ జనవరి నుంచి రూ.2500 లుగా పెంచి 7369 మందికి అందిస్తున్నామన్నారు. గతంలో జన్మభూమి కమిటీ ల పేరుతో వారికి మద్దతు తెలిపే varike పెన్షన్లు ఇచ్చేవారన్నారు


. మన ప్రభుత్వం అధికారంలోకి వొచ్చకా వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వొచ్చి, అర్హులైన వారిని గుర్తించి, పారదర్శకంగా పెన్షన్ లను మంజురు చేస్తున్నామని తెలిపారు. చాగల్లు మండల పరిధిలో కొత్తగా జనవరి నుంచి మరో 290 మందికి పెన్షన్లు మంజురూ చేసి అందించడం జరిగిందన్నారు. జగనన్న ప్రభుత్వం మహిళాల, పేదల, బడుగు బలహీన వర్గాల పక్షపాత ప్రభుత్వ మన్నారు. ఈరోజు సావిత్రి బాయి ఫూలే జన్మదినమని గుర్తు చేస్తూ,  మహిళల విద్యాభివృద్ధికి ఆమె చేసిన సేవలు నీరూపమానవైనవన్నారు. జగనన్న సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.  కోవిడ్ సమయంలో కూడా ఏ ఒక్కసారి కూడా పేదలకు అందించే సంక్షేమ కార్యక్రమాలు ఆపు చెయ్యకుండా అమలు చేసిన ఘనత జగనన్న కే చెల్లుతుందని తానేటి వనిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు,  వృద్ధులు, దివ్యాంగులకు జనవరి నెల పెన్షన్ సొమ్మును మంత్రి అందచేశారు. 


ఈ కార్యక్రమానికి  చాగల్లు జెడ్పిటిసి గారపాటి విజయదుర్గా, ఎంపిపి మాట్టా వీరాస్వామి, ఎంపీడీఓ బి. రాం ప్రసాద్, తాహసీల్దార్ ఎమ్. శ్రీనివాసరావు, సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు,  అధికారులు, పెన్షనర్లు,   తదితరులు పాల్గొన్నారు.



Comments