న్యూఢిల్లీ – ఫిబ్రవరి 10, (ప్రజా అమరావతి) :
రాష్ట్ర ఆర్ & బి శాఖ మంత్రి యం. శంకరనారాయణ - మీడియా సమావేశం
రాష్ట్ర ఆర్ & బి శాఖ మంత్రి యం.శంకరనారాయణ నేడు ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో మీడియా సమావేశంలో నిర్వహించారు. ఆయన ఈ రోజు కేంద్ర ఆర్ & బి శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ని మర్యాదపూర్వకంగా భేటీ అయిన సందర్భంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ లో రూ.20,000 కోట్లతో చేపట్టిన 51 ప్రాజెక్టుల భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు
కేంద్ర మంత్రిని ఆహ్వానించడం జరిగింది.
ఈ నెల 17న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రాజెక్టుల భూమి పూజ నిర్వహించి ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్ & బి శాఖ మంత్రి.
విజయవాడ తూర్పు బైపాస్, విశాఖ - భోగాపురం ఎయిర్పోర్టుకు 6 వరుసల రహదారి, కడప – రేణిగుంట రహదారి నిర్మాణం మరియు నిధుల పై కేంద్ర మంత్రికి విజ్ఞప్టి చేయడం జరిగింది.
అనంతపురం, చిత్తూరు మరియు ఇతర జిల్లాలో ఉన్న ముఖ్యమైన మరియు అంతర్-రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులగా గుర్తించాల్సిందిగా కోరామన్నారు.
రూ.2,200 కోట్లతో అన్ని జిల్లాల్లో రహదారుల మరమ్మత్తు పనులు చేపట్టనున్నాం. వీటికి నిధులు రాష్ట్రం 30%, మిగతా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సమకూర్చనున్నాయి.
త్వరితంగా పనుల పూర్తీ, సకాలంలో సమృద్ధిగా నిధుల విడుదల, టెండర్ ల గూర్చి చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి, సుముఖత వ్యక్తం చేశారని మంత్రి పేర్కొన్నారు.
addComments
Post a Comment