మహాశివరాత్రి ఉత్సవములు-2022 ప్రారంభం:

 మహాశివరాత్రి ఉత్సవములు-2022 ప్రారంభం: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి): 

   దేవస్థానం నందు మహా శివరాత్రి ఉత్సవములు పురస్కరించుకుని ఈరోజు అనగా ది.26-02-2022 న శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయం వద్ద ఉదయం 09.30 గం. ల నుండి 11.00గం.ల వరకు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవరులకు శాస్త్రోక్తంగా ఆలయ స్థానాచార్యులు వారి ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రధానార్చకులు శ్రీ మల్లేశ్వర శాస్త్రి గారు మరియు అర్చకులచే మంగళ స్నానములు ఆచరింపజేసి, వధూవరులు గా అలంకరించుట జరిగినది.

  ఈ కార్యక్రమం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు పాల్గొని మంగలవాయిద్యముల నడుమ శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్లకు పట్టువస్త్రాలు అందజేసి, భక్తిశ్రద్ధలతో పూజాది కార్యక్రమములు నిర్వహించారు. 


  అనంతరం సాయంత్రం 04 గం. ల నుండి 07 గం.ల వరకు అంకురార్పణ, మండపారాధన, కలశస్థాపన, ధ్వజారోపన, అగ్నిప్రతిష్టాపన, మూలమంత్ర హవనములు, బలిహారణ, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుపబడినది.