24 గంటల్లో బంగారు షాపు చోరీ మిస్టరీని చేధించిన పోలీసులు.
- విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్.,
6.181 కిలోల బంగారు ఆభరణాలు, 90.52 గ్రాముల సిల్వర్ బ్రాస్ లెట్లు, మరో రూ. 15 వేలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు*
నిందితుడు లోకేష్ శ్రీవాస్ ను చత్తీస్ ఘడ్లో పట్టుకున్న పోలీసు బృందం.
క్రియాశీలకంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించి, ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్.
విజయనగరం (ప్రజా అమరావతి); పట్టణం రవి జ్యూవెలరీ షాపులో ఈ నెల 21న చోరీకి పాల్పడిన నిందితుడ్ని 24గంటల్లోనే
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో అరెస్టు చేసి, చోరీ మిస్టరీని చేధించినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక, ఐపిఎస్ ఫిబ్రవరి 26న,
శనివారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
విజయనగరం పట్టణం కోళ్ళ బజారు దగ్గర గల రవి జ్యూవెలరీ షాపులో గుర్తు తెలియని దొంగలు
ప్రవేశించి, షాపులోగల 8 కిలోల బంగారు ఆభరణాలు (ఒక కోటి 36 లక్షలు విలువైనవి) పోయినట్లుగా షాపు
యజమాని కోట రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి,
దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఎం. దీపిక మరియు విజయనగరం సబ్ డివిజన్ ఇన్ చార్జ్
అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి,
సిసిఎస్ పోలీసులు, క్లూస్ టీం నేర
స్థలంను సందర్శించి, నేరం జరిగిన తీరును
పరిశీలించి, సాంకేతిక, భౌతిక ఆధారాలను సేకరించి, ఈ నేరంకు పాల్పడింది ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా
ఒక అభిప్రాయానికి వచ్చారు.
జిల్లా ఎస్పీ ఆదేశాలతో అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాల
ను ఏర్పాటు చేసి, చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి పంపారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రం కబీర్ధాం జిల్లా కవర్ధా పట్టణంకు చెందిన
లోకేష్ శ్రీవాస్ అనే పాత నేరస్థుడిని చత్తీస్ ఘడ్ పోలీసుల సహకారంతో అతని ఇంటి వద్దనే ఈ నెల 24న అరెస్టు
చేసి, అతని వద్ద నుండి 6.181 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పోలీసుల
విచారణలో నిందితుడి లోకేష్ శ్రీవాస్ విజయనగరం పట్టణంలో మరో మూడు నేరాలకు పాల్పడినట్లుగా
అంగీకరించడంతో, అతని వద్ద నుండి 90.52 గ్రాముల సిల్వర్ బ్రాస్ లెట్లును, రూ. 15 వేలు నగదును స్వాధీనం
చేసుకున్నారు. సిఎంఆర్, పాండు జ్యూవెలరీ షాపు మరియు పద్మజ ఆసుపత్రి మెడికల్ షాపులో చోరీలకు పాల్పడి,
తన అవసరాలకు డబ్బులను ఖర్చు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ కేసును జిల్లా ఎస్పీ ఎం. దీపిక
స్వయంగా పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు చత్తీస్ ఘడ్ పోలీసు అధికారులతో మాట్లాడుతూ, దర్యాప్తు బృందానికి
దిశానిర్దేశం చేసారు.
నిందితుడు లోకేష్ శ్రీవాస్ 10వ తరగతి వరకు చదివినట్లు, మొదటి భార్య అనారోగ్యంకు బాగా అప్పులు
చేసి, వైద్యం చేయించినప్పటికీ 2014లో చనిపోవడంతో, వాటిని తిరిగి పొందేందుకు తన స్నేహితుల సూచనలతో
చోరీలకు పాల్పడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు ఒడిస్సా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో 11 కేసుల్లో
నిందితుడిగా ఉన్నారన్నారు. నిందితుడి జైలులో ఉన్న సమయంలో శ్రీకాకుళంకు చెందిన ఒక నేరస్థుడితో
పరిచయం ఏర్పడి, అతని సలహాతో విజయనగరం పట్టణానికి జనవరి 16న మొదటిసారిగా వచ్చి పద్మజ ఆసుపత్రి
లో చోరీకి పాల్పడ్డాడు. అదే విధంగా ఫిబ్రవరి 14న మళ్ళీ మరోసారి వచ్చి సి.ఎం.ఆర్.లో చోరీకి పాల్పడ్డాడు.
మళ్ళీ ఫిబ్రవరి 21న విజయనగరం పట్టణం వచ్చి రెక్కీ నిర్వహించి, రవి జ్యూవెలరీ, పాండు జ్యూవెలరీ షాపుల్లో
చోరీలకు పాల్పడ్డారన్నారు. ప్రస్తుతం చత్తీస్ ఘడ్ లో సెలూన్ నడుపుకుంటున్నాడని, అతని 2వ భార్య బ్యూటీ పార్లర్
నడుపుతున్నట్లుగా విచారణలో వెల్లడయ్యిందని
జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.
ఈ కేసుల్లో విజయనగరం 1వ పట్టణ సిఐ జె.మురళి, సిసిఎస్ ఇన్స్ పెక్టర్లు సిహెచ్. శ్రీనివాసరావు,
ఎస్. కాంతారావు, ఎస్ఐ వి. అశోక్ కుమార్, హెడ్ కాని స్టేబుళ్ళు డి. శంకర్రావు, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్,
ఎం. అచ్చిరాజులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను
అందజేసారు.
ఈ మీడియా సమావేశంలో విజయనగరం డివిజన్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, విజయనగరం
1వ పట్టణ సిఐ జె.మురళి,
సిసిఎస్ ఇన్స్ పెక్టర్లు సిహెచ్.శ్రీనివాసరావు, ఎస్. కాంతారావు, ఎస్బీ సిఐలు జి. రాంబాబు,
ఎన్.శ్రీనివాసరావు, ఎస్ఐ వి. అశోక్ కుమార్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment