రష్యాపై ఉక్రెయిన్ తిరుగుబాటు.. 300 మంది పౌరులు మృతి
మాస్కో(ప్రజా అమరావతి): రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో 18 చోట్ల ఇప్పటికే 300 మంది పౌరులు మరణించారు. 23 ప్రాంతాల్లో రష్యా బాలిస్టిక్ మిస్సైల్ ఎటాక్ జరుపుతోంది. రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్ ఎదురుదాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు మొదలు పెట్టింది. రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్ ప్రభుత్వం మార్షల్ లా విధించింది. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ఉక్రెయిన్ ఆదేశించింది. ఉక్రెయిన్‌ను ప్రపంచ దేశాలు అడ్డుకోవాలని కోరింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శుక్రవారం జీ-7 దేశాలతో జో బైడెన్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు. రష్యా దాడులపై ఉక్రెయిన్ స్పందించింది.
addComments
Post a Comment