దుబాయ్ (ప్రజా అమరావతి);
*ఏపీ ప్రభుత్వంతో 3 కీలక ఒప్పందాలు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
*రూ.3వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంవోయూ*
*రెండు జీ2బీ, ఒక బీ2బీ అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్న ఏపీ*
*విజయవంతంగా "దుబాయ్ ఇన్వెస్ మెంట్ రోడ్ షో"*
*ఇవాళ డీపీ వరల్డ్ తో ఎంవోయూ చేసుకోనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం : మంత్రి గౌతమ్ రెడ్డి*
దుబాయ్, ఫిబ్రవరి,15: ఏపీ ప్రభుత్వంతో 3 కీలక ఒప్పందాలు జరిగినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. మంత్రి మేకపాటి సమక్షంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. తాజ్ బిజినెస్ బే హోటల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం "దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో" జరిగింది. అన్ని రంగాల పెట్టుబడులకు అవకాశం గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి గౌతమ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సహజవనరులు, సకల సదుపాయాలు పుష్కలంగా కలిగిన ఏపీలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తూ "యూ గ్రో వి గ్రో" అన్న ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని మంత్రి మేకపాటి వినిపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అవకాశాలపై ఏపీ ప్రభుత్వం ప్రదర్శించిన వీడియో పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది.
దుబాయ్ ఎక్స్ పో 2020 పర్యటనలో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల అధికారుల బృందం సోమవారం మూడు కీలక ఎంవోయూలను కుదుర్చుకుంది. రెండు జీ2బీ, ఒక బీ2బీ తరహా అవగాహన ఒప్పందాలు చేసుకుంది. లండన్ కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.3వేల కోట్ల విలువైన ఎంవోయూ చేసుకుంది. రూ.150 కోట్ల విలువైన 25 రీటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన రీజెన్సీ గ్రూప్ కూడా ఎంవోయూ కుదుర్చుకుంది. రీటైల్ వ్యాపారంలో గ్రాంట్ హైపర్ మార్కెట్ బ్రాండ్ నేమ్ తో 25 సంవత్సరాలుగా సత్తా చాటుతున్న రీజెన్సీ గ్రూప్ తో జీ2బీ(గవర్నమెంట్ టు బిజినెస్) ఏపీ ఒప్పందం చేసుకుంది. అనంతపురం, కడప, కర్నూలు, మదనపల్లి,చిత్తూరు, నెల్లూరు, హిందూపురం ప్రాంతాలలో పంపిణీ కేంద్రాలు, స్పైసెస్ అండ్ పల్సెస్ ప్యాకేజీ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. యూఏఈ రీటైల్ సంస్థల ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రీటైల్ వాణిజ్యం మరింత ముందడుగు పడింది. విశాఖలోని "ఫ్లూయెంట్ గ్రిడ్" అనే ఎస్సార్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ లో భాగమైన ట్రోయో జనరల్ ట్రేడింగ్ సంస్థతో బీ2బీ ఎంవోయూ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఏఐ అండ్ ఎంఎల్ టెక్నాలజీస్ పేరుతో విశాఖలో కొత్తగా 300 హైఎండ్ ఐ.టీ ఉద్యోగాలిచ్చే దిశగా ఒప్పందం కుదిరింది. ఎస్సార్ గురేర్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ బోర్డు సభ్యులు మాజీదల్ గురేర్ , ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థకు చెందిన సమయ్ మంగళగిరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ప్రజా రవాణాకు సంబంధించిన డీజిల్ వాహనాలను తీర్చిదిద్దే పరిశ్రమను వైఎస్ ఆర్ కడప జిల్లా జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఏర్పాటు చేయడానికి మరో పరిశ్రమ ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఒప్పంద పత్రాలను మార్చుకున్న ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, కాజస్ కంపెనీ ఎండీ రవికుమార్ పంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తాజ్ బిజినెస్ బే హోటల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం "దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో" విజయవంతంగా ముగిసింది.
*అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యం కలిగిన దేశం 3వ యూఏఈ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
భారత్ , యూఏల మధ్య ఆత్మీయ వాణిజ్యపరంగా విడదీయలేని బంధం ఉందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. దేశ వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కీలకమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రత్యామ్నాయం లేని రాష్ట్రంగా మారిందని మంత్రి తెలిపారు. కలిసి ఎదగడానికి, పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని మంత్రి మేకపాటి తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య రంగాలలో ఏపీకి తిరుగులేదన్నారు. ఆక్వా రంగంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ అని మంత్రి స్పష్టం చేశారు. 16000 ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, 180 లార్జ్ , మెగా ఆహార శుద్ధి పరిశ్రమలున్న రాష్ట్రంగా 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయన్నారు. సహజవనరులు, తీరప్రాంతం, పారదర్శక పాలన, పెట్టుబడిదారులతో స్నేహపూర్వక సంబంధాలున్న ఏపీ సమగ్ర మౌలిక సదుపాయాలకు మరింత పెద్దపీట వేస్తుందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ లు, రాష్ట్రం నలుమూలలకు వెళ్లేలా జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, కడప స్టీల్ ప్లాంట్, టెక్స్ టైల్ పార్కులు, మల్టీ లాజిస్టిక్ పార్కులు, త్వరలో కొలువుదీరనున్న పెట్రోలియం కాంప్లెక్స్ వంటి చౌక వాణిజ్యానికి గల అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరత, సుపరిపాలన, పారదర్శక పారిశ్రామిక విధానాలతో పెట్టుబడిదారులకు సాదరంగా ఆహ్వానం పలుకుతోందని మంత్రి మేకపాటి తెలిపారు. రాబోయే ఐదేళ్లకే కాదు..రానున్న 15 ఏళ్ళలో పెట్టుబడిదారులను ఆకర్షించే పాలసీ ఆంధ్రప్రదేశ్ ది అని పారిశ్రామికవేత్తలు స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి మేకపాటి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
*ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో ముందుంది : పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్*
ఆంధ్రప్రదేశ్ యూఏఈల మధ్య ద్వైపాక్షిక బంధాలు ఈ పెట్టుబడుల ఎంవోయూలతో మరింత బలపడుతున్నాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వెల్లడించారు. సహజవనరులు, పారదర్శక పారిశ్రామిక విధానం, నైపుణ్య మానవవనరులతో ఏపీ అన్నింటా ముందుందని ఆయన అన్నారు. పోర్టులు, విమానయాన, రవాణ రంగాలలో ఎక్కువ అవకాశాలున్నాయని కరికాల పేర్కొన్నారు. 6 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, 3 పారిశ్రామిక కారిడార్లలోని 10 నోడ్ల అభివృద్ధితో ఎవరైనా చౌకగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించవచ్చునని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు.
*పెట్టుబడుల దిశగా కీలక అడుగు : ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది*
యూఏఈ ప్రభుత్వంతో దుబాయ్ ఎక్స్ పో వేదికగా మరిన్ని సోమవారం నాటి ఎంవోయూలతో పాటు మరిన్ని ఎంవోయూలు జరగనున్నాయని ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది స్పష్టం చేశారు. పారిశ్రామిక సంస్కరణలు, పారదర్శక విధానం, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాలలో పెట్టుబడులు రానున్నాయన్నారు. గత మూడేళ్లలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానం, ఎగుమతులలో 9వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకడమే అందుకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. వైద్యం, విద్యా రంగాలలో ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను యావత్ దేశం కొనియాడినట్లు ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం ప్రజలకు అందించిన సేవలను ప్రపంచం మెచ్చుకుందన్నారు. డబ్ల్యూ హెచ్ వో ప్రశంసలే అందుకు ఉదాహరణ అన్నారు.
ఈ పెట్టుబడుల రోడ్ షో, ఎంవోయూల కార్యక్రమంలో ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు, జాయింట్ డైరెక్టర్ వీఆర్ వీఆర్ నాయక్, ఈడీబీ, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment