సోమవారం స్పందన లో 5 ఆర్జీలు వొచ్చాయి ఆర్డీవో ఎస్. మల్లిబాబుకొవ్వూరు (ప్రజా అమరావతి);  


సోమవారం స్పందన లో  5 ఆర్జీలు వొచ్చాయి ఆర్డీవో ఎస్. మల్లిబాబుప్రజా సమస్యలపై మండల, గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది స్పందించి  క్షేత్రస్థాయిలో పరిష్కారం చూపాలని  రెవెన్యూ డివిజినల్ అధికారి ఎస్. మల్లి బాబు తెలియచేసా రు. 


స్థానిక  ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పం దన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మ ల్లిబాబు మాట్లాడుతూ ప్రజల సమస్య లు ఏమైనా ఉంటే ఆయా మండలాలకు సంబం దించిన తాహిసీల్దార్, గ్రామ వార్డు సచివాలయా ల్లో దరఖాస్తు లు చేసుకుంటే త్వరిత గతిన సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు . 


తాళ్లపూడి మండలం నుంచి ఆక్రమణలు తొలగించి భూమి కొలతలు చేసి అప్పగించాలని,  పేదలందరికి ఇళ్ళు పధకం పురుషుల పేరు మీద మంజురూ పై సమగ్ర దర్యాప్తు, దేవరపల్లి మండలం నుంచి రహదారికి అడ్డంగా చర్చి నిర్మాణం పైన ఫిర్యాదులు స్పందనలో ఇవ్వడం జరిగింది.


ఈ కార్యక్రమంలో డీఎల్ డిఓ జగదాంబ, డీఈ హౌసింగ్ సీహెచ్. బాబూరావు, ఆర్డీఓ కార్యాలయ ఏ. వో. ,జి.ఎస్.ఎస్.జవహర్ బాజీ, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నా రు. Comments