*జిల్లాలో 5619 మంది బడి బయట పిల్లలు
*
*సమగ్రశిక్ష సర్వే లో గుర్తింపు*
*26 విభాగాల నుంచి డేటా సేకరణ*
*మండల స్థాయిలో ఎన్యుమరేటర్స్ తో అన్ని విభాగాల సర్వే*
* బడి బయటి విద్యార్ధులను స్కూళ్లలో చేర్పించేందుకు ఏర్పాట్లు*
*సమగ్రశిక్ష ఎపిసి డాక్టర్ వేమలి స్వామినాయుడు*
విజయనగరం, ఫిబ్రవరి 09 (ప్రజా అమరావతి):
బడి బయట ఉంటున్న విద్యార్ధులను గుర్తించేందుకు సమగ్రశిక్ష ద్వారా చేపట్టిన సర్వే ద్వారా జిల్లాలో 5619 మంది విద్యార్దులను గుర్తించామని సమగ్రశిక్ష ఎపిసి డా.వి.స్వామి నాయుడు తెలిపారు. ఈ పిల్లలందరినీ వారి స్థాయిని బట్టి వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 5వ తేది వరకు జిల్లాలో మొత్తం 34 మండలాల్లో ఓ.ఎస్.సి. సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లలో చేపట్టిన బడి బయట పిల్లల సర్వే వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు.
అవుట్ అఫ్ స్కూల్ చిల్ద్రెన్ ఓ.ఎస్.సి. సర్వే ద్వారా బడి బయట పిల్లల గుర్తింపు కోసం మన బడికి పోదాం యాప్ ద్వారా జిల్లా సమగ్రశిక్ష వారు ఈ సర్వే చేపట్టటం జరుగుతుంది. బడి ఈడు పిల్లలు ఎవరైనా ఉంటె వారిని బడిలో చేర్పించడానికి యీ సర్వే దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిస్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా సమగ్రశిక్ష వారు అంతే నిబద్దతతో జిల్లా మొత్తం సర్వే ను చేపడుతూ వస్తుంది. ఇలా చేపట్టిన సర్వే లో గుర్తించిన పిల్లను నచ్చచేప్పో, ఒప్పించో, బతిమలాడో ఎదో ఒకరకంగా వారిని ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధనలు నేర్పించాలన్నది ఓ.ఎస్.సి. సర్వే యొక్క ముఖ్య ఉద్దేశ్యం, అలాగే ప్రధాన లక్ష్యం కూడా.
*జిల్లాలో ఓ.ఎస్.సి. స్టేటస్ :-*
రాష్ట్రము లో అన్ని జిల్లాలలో బడి బయట పిల్లలను గుర్తించి వారిని పాఠశాలకు పంపించే బాధ్యత రాష్ట్ర సమగ్రశిక్ష జిల్లాలకు అప్పగిస్తుంది. ప్రతి ఏడాది లాగానే 2022-23 ఏడాది కూడా విజయనగరం జిల్లాకు సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఓ.ఎస్.సి. సర్వే బాధ్యత అప్పగించింది. 2022-23 ఏడాది సర్వే కోసం సమగ్రశిక్ష విజయనగరం జిల్లా వారు పక్క ప్రణాళిక రూపొందిచుకున్నారు. రాష్ట్ర సమగ్రశిక్ష వారు అప్పగించిన బాధ్యతను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి తగు సన్నాహాలు మొదలు పెట్టారు. మండల స్థాయిలో ఈ పని కోసం సమగ్రశిక్ష ఎన్యుమరేటర్స్ అయిన సిఆర్పీలు, పార్ట్ టైం ఇంస్త్రక్టర్స్, కెజిబివి సిబ్బందిని నియమించడం జరిగింది. వీరంతా పట్టణాల్లోను, పల్లెలలోను తిరిగి సర్వేలు చేపట్టి జిల్లాలో 5619 మంది బడి బయట పిల్లల వివరాలను సేకరించి వాటిని మనబడికి పోదాం యాప్ ద్వారా జిల్లా సమగ్రశిక్ష వారికి డేటాను అందజేసారు.
*25 విభాగాల నుంచి గుర్తింపు :*
జిల్లా మొత్తం జరిగిన ఈ సర్వే ద్వారా 25 రకాల విభాగాలకు చెందిన పిల్లలను గుర్తింపు చేయడం జరిగింది. వీటిల్లో ఇప్పటికే పాఠశాలలో చేరిన పిల్లలు, బాల కార్మికులు, మనస్పర్ధలు వలన విడిపోయిన తల్లితండ్రుల పిల్లలు, యాచకులు, ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలు, సంచార జాతుల పిల్లలు, వలసపోయిన కార్మికుల పిల్లలు, లాంగ్ ఎబ్సేంట్స్ ఉన్న పిల్లలు, అనాధ పిల్లలు, నివాస ప్రాంత సమీపంలో పాఠశాల లేకపోవడం, ఓవర్ ఏజ్, దివ్యాంగుల పిల్లలు, పిల్లలను చదివించేందుకు ఆసక్తి లేని తల్లితండ్రుల పిల్లలు వంటి 26 విభాగాల నుంచి బడి బయట పిల్లలను గుర్తించడం జరిగింది.
*పిల్లలను విద్యార్ధులుగా చేర్పించడం :*
2022-23 సంవత్సరం లో జరిగిన సర్వే ద్వారా జిల్లాలో గుర్తించిన 5619 మంది పిల్లలను వారి వారి స్థాయిలను బట్టి పాఠశాలలలో విద్యార్ధులుగా చేర్పించేందుకు జిల్లా సమగ్రశిక్ష సన్నాహాలు ప్రారభించింది. ముఖ్యంగా ఓ.ఎస్.సి. ద్వారా గుర్తించిన దివ్యాంగుల పిల్లలను సమగ్రశిక్ష వారి ఆధ్వర్యలో నడుస్తున్న భవిత, నాన్ భవిత సెంటర్ లలో చేర్పించి వారికి విధ్యాబోధనలు అందించేందుకు కృషి చేస్తున్నారు. అయితే జిల్లాలో 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న 4546 మంది పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలలో విద్యాబుద్దులు నేర్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే 15 నుంచి 19 సంవత్సరాలు వయసు ఉన్న 1073 మంది పిల్లలను ఓపెన్ స్కూల్స్ ద్వారా విద్యార్హత సాదించటానికి అవకాశం కల్పించనున్నారు.
రాష్ట్ర సమగ్రశిక్ష వారి ఆదేశాల మేరకు జిల్లాలో బడి బయట పిల్లల సర్వే పూర్తి చేయడం జరిగింది. జరిగిన సర్వే ఆధారంగా గుర్తించిన పిల్లలను వారి వారి వయస్సును బట్టి పాఠశాలలో చేర్పించేదుకు సన్నాహాలు చేపడుతున్నాం. ఇలా గుర్తించిన విధ్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిచేందుకు అనుమతులు కోరుతూ ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా సమగ్రశిక్ష ఛైర్పర్సన్ వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కలెక్టర్ అనుమతులు వచ్చిన వెంటనే పిల్లలను పాఠశాలలో చేర్పించి విద్యాబుద్దులు అందిచడం జరుగుతుంది. ఎంతో కష్టపడి పని చేసి ఈ సర్వేను మండల స్థాయిలో విజయవంతం చేసిన ఎన్యుమరేటర్స్, ఎంఆర్సి సిబ్బంది, జిల్లా స్థాయి సిబ్బంది అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను.
డాక్టర్ వేమలి స్వామినాయుడు, అదనపు పథక అధికారి, సమగ్రశిక్ష, విజయనగరం జిల్లా.
addComments
Post a Comment