అండాకారంలో ఉన్న అయస్కాంతం మింగిన 8 సం॥ల బాలుడు.

 అండాకారంలో ఉన్న అయస్కాంతం మింగిన 8 సం॥ల బాలుడు.



రమేష్‌ హాస్పిటల్స్‌లో ఎండోస్కోపి చికిత్సతో తప్పిన ప్రాణగండం.

గుంటూరు (ప్రజా అమరావతి);

అండాకారంలో ఉన్న అయస్కాంతం మింగిన 8 సం॥ల బాలుడికి ఎండోస్కోపిక్‌ విధానంలో అత్యవసన పరిస్థితులలో అర్థరాత్రి వేళ సకాలంలో చికిత్స చేయటం ద్వారా ప్రాణహాని నుంచి కాపాడిన ప్రముఖ జీర్ణకోశ వ్యాధినిపుణులు డా॥ లోకేష్‌.


15వ తేదీ మంగళవారం రాత్రి 12:30 ని॥లకు తల్లితండ్రులు తమ కుమారుడు అయస్కాంతం మింగినట్లు గ్రహించి రమేష్‌ హాస్పిటల్స్‌కు తీసుకురావటం జరిగింది. ఐరన్‌, అల్యూమినియం, నికెల్‌, కోబాల్ట్‌ మరియు కొన్ని అరుదైన ఎలిమెంట్స్‌తో కూడిన అండాకారంలో ఉన్న అయస్కాంతం వంటివి మింగటం వలన అమైనోయాసిడ్స్‌ పెరగటం మరియు పొట్టలో కానీ చిన్న ప్రేగులలో ఇరుక్కోవటం వలన ప్రేగులు చిట్లిపోవటం జరగవచ్చని పొట్ట క్రింది భాగంలో వున్న ఆ అయస్కాంతంను ఎండోస్కోపిక్‌ విధానంలో తీసివేసామని ఇటువంటి వాటిని తల్లితండ్రులు పిల్లలకు దూరంగా వుంచాలని గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డా॥ లోకేష్‌ సూచించారు.


రమేష్‌ హాస్పిటల్స్‌ డిప్యూటి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా॥ రాయపాటి మమత ఈ సందర్భంగా వైద్యులను అభినందించారు. 24 గం॥లూ రమేష్‌ హాస్పిటల్స్‌లో అత్యవసర వైద్యం అందుబాటులో ఉంటుందని తెలియచేసారు.

Comments