సర్వీసులను ఎలాంటి పెండింగ్ ఉంచరాదు*
*: జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*
*: ధర్మవరం అర్బన్ లోని 1వ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
ధర్మవరం (అనంతపురం), ఫిబ్రవరి 16 (ప్రజా అమరావతి):
సచివాలయానికి వచ్చే గ్రీవెన్స్ లను ఎలాంటి పెండింగ్ ఉంచరాదని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం ధర్మవరం అర్బన్ లోని సరస్వతి నగర్ లో ఉన్న 1వ వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ప్రతి రోజు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాలన్నారు. సచివాలయానికి వస్తున్న గ్రీవెన్స్ లను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సచివాలయం పరిధిలో నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద ఇళ్ల నిర్మాణాలు, ఓటిఎస్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జగనన్న హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్క ఇళ్లను బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలన్నారు. ఓటిఎస్ (వన్టైమ్ సెటిల్మెంట్) కింద లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈనెలలో ప్రభుత్వం అందించనున్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాల కింద అర్హులైన వారందరికీ లబ్ది చేకూర్చాలన్నారు. సచివాలయం పరిధిలోని 4 అంగన్వాడి కేంద్రాలను, పాఠశాలలను నిత్యం తనిఖీ చేయాలన్నారు. సిటిజన్ అవుట్ రిచ్ ప్రోగ్రాంను చేపట్టాలన్నారు. సచివాలయ ఉద్యోగులు యూనిఫామ్ ను త్వరితగతిన సిద్ధం చేసుకుని ఉపయోగించాలన్నారు. సచివాలయం పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేయాలన్నారు. ప్రభుత్వ పథకలు, కార్యక్రమాల అమలులో జాగ్రత్తగా పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓటిఎస్ (వన్టైమ్ సెటిల్మెంట్)ను ఉపయోగించుకున్న అరుణమ్మ, కుల యమ్మ ,లబ్ధిదారులకు అక్నాలెడ్జ్మెంట్ కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వరప్రసాద్, కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ నీలకంఠారెడ్డి, హౌసింగ్ ఈఈ చంద్రశేఖర్, డిఈ మునీశ్వర నాయుడు, ఎఈలు బాలాజీ శేషవలి, కౌన్సిలర్ రామలక్ష్మమ్మ, సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment