ఆంధ్ర రాష్ట్ర సర్పంచ్ ల అవగాహన సదస్సు

 ఆంధ్ర రాష్ట్ర సర్పంచ్ ల అవగాహన సదస్సు


.

మంగళగిరి (ప్రజా అమరావతి);

 తెలుగుదేశం పార్టీ రాష్ట్ర  కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్  అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్  గారి అధ్యక్షతన గురువారం నాడు 4 జిల్లాలు, శుక్రవారం నాడు 3 జిల్లాల సర్పంచ్ లతో  జరిగినటువంటి  సర్పంచుల అవగాహన సదస్సుకు  ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించిన తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌ,శ్రీ. నారా చంద్రబాబునాయుడు 


 _ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎన్నో జీవోలు సాధించిన రాజేంద్ర ప్రసాద్ గారికి అభినందనలు తెలిపిన  చంద్రబాబు .


 ఈ కార్యక్రమాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు మరియు మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్ గారు  "స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు" గారి విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు. 


 ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ గతం లో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి సర్పంచ్ లకు నిధులు, విధులు సాధించిపెట్టిన ఘనత రాజేంద్రప్రసాద్ ది  అని,  1996లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరియు తదుపరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఎన్నో ఉద్యమాలు చేసి సర్పంచ్ లకు, ఎంపిటిసి లకు  అనేక జీవోలు సాధించి పెట్టారని, సమాజంలో వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థలే  శాశ్వతంగా చరిత్రలో మిగిలిపోతాయి అని గుర్తు పెట్టుకోవాలని, అనేక పోరాటాలు చేసిన రాజేంద్ర ప్రసాద్ నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అనే వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని, చాలా రోజుల తర్వాత మరలా ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని, దీనిని ఆంధ్ర ప్రదేశ్ సర్పంచుల సంఘం తరపున పోరాడి మీ హక్కులు సాధించుకోవాల్సిన సమయం వచ్చిందని, దీనికి రాష్ట్రంలోని సర్పంచ్ లందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాలు చేసి రాజ్యాంగం  సర్పంచ్ లకు  కల్పించిన హక్కుని రక్షించుకోవాలని, మీరు పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున చేసే ఉద్యమాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నారా *చంద్రబాబు నాయుడు* గారు అన్నారు.


 రాజేంద్ర ప్రసాద్  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామాల అభివృద్ధికి పంపించిన నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకోవడం మన సర్పంచ్ లను  మోసం చేయడమేకాకుండా మన హక్కులను కాలరాస్తూoదని, ఈ అన్యాయం ఒక పార్టీకి సంబంధించిన సర్పంచులకో లేక ఒక వర్గానికి సంబంధించిన సర్పంచ్ లకో జరుగుతున్నది కాదని, రాష్ట్రంలోని సుమారు పన్నెండు వేల ఐదు వందల మంది సర్పంచ్ లకు జరుగుతున్న అన్యాయమని, దీనిని కనుక అడ్డుకోకపోతే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయి సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాల్లాగా మిగిలిపోతారని,  కావున రాజకీయ పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని సర్పంచులు అందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమాలు, పోరాటాలు చేసి మన హక్కులను కాపాడుకుందామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.


 ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు ముల్లంగి రామకృష్ణారెడ్డి (కృష్ణా జిల్లా) , బిర్రు ప్రతాప్ రెడ్డి (కర్నూల్) , సింగంశెట్టి సుబ్బరామయ్య (తిరుపతి) , వినోద్ రాజు (విశాఖ జిల్లా), ముత్యాల రావు (విశాఖ), చుక్క ధనుంజయ్ యాదవ్ (చిత్తూరు ), ఎండి ఇస్మాయిల్ (అనంతపురం) , మునిరెడ్డి (కడప, వసుధ, విజేత  (గుంటూరుజిల్లా),మీనాక్షి నాయుడు (కర్నూల్ జిల్లా) మొదలగు వారు పాల్గొన్నారు.

Comments