పొత్తులకోసం కేసీఆర్ పాకులాడుతున్నారు: రఘునందన్ రావు

 పొత్తులకోసం కేసీఆర్ పాకులాడుతున్నారు: రఘునందన్ రావు



హైదరాబాద్ (ప్రజా అమరావతి): పొత్తుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాకులాడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కంటే గొప్పగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై సీఎం కేసీఆర్ సానుభూతి చూపించారని తప్పుబట్టారు.


కాంగ్రెస్ నేత సోనియా, టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రధాని మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కేసీఆర్ కళ్లల్లో నీళ్లెందుకు రాలేదు? అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలవకుండా కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. తన సొంత కుటుంబ సభ్యులను నమ్మలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారని రఘునందన్‌రావు విమర్శించారు..

Comments