భారతీయ నౌకాదళంలో తూర్పుతీర నౌకాదళ కేంద్రం ది సిటీ ఆఫ్‌ డెస్టినీ విశాఖపట్నం పాత్ర చిరస్మరణీయమైనది.


విశాఖపట్నం (ప్రజా అమరావతి);


ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ మిలాన్‌ –2022  కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, శ్రీమతి వైయస్‌.భారతి దంపతులు.


నేవల్‌ డాక్‌యార్డులోని ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం అంకిత ఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.

కార్యక్రమంలో పాల్గొన్న నావికాదళ ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు.


అనంతరం ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామిని సందర్శించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, శ్రీమతి వైయస్‌.భారతి దంపతులు.


ఆర్కే బీచ్‌లోని ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ మిలాన్‌ –2022 వేడుకలను ప్రారంభించిన సీఎం.

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:


గౌరవనీయులైన చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాప్, పీవీఎస్‌ఎం, ఏవీఎస్‌ఎం, వీఎస్‌ఎం ఆడ్మిరల్‌ హరికుమార్, వైస్‌ ఆడ్మిరల్, ప్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్, ఈఎన్‌సీ విశ్వజిత్‌ దాస్‌ గుప్తా, నావికాదళ ఉన్నతాధికారులు, రాయబారులు, ఇతర దేశాల ప్రతినిధులు, ఇతర ఆహుతులు, గౌరవనీయులైన స్పీకర్, నా సహచర మంత్రులు, విశాఖ వాసులకు శుభ సాయంత్రం. 


 మిలాన్‌ –2022కు అలంకరించబడిన విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించతగిన రోజు. ఈ సాయంత్రం జరుగుతున్న ఉత్సవంలో 39 దేశాలు ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌ కార్యక్రమాలతో మేరిటైమ్‌లో  భాగస్వామ్యులవుతున్నాయి. 


భారతీయ నౌకాదళంలో తూర్పుతీర నౌకాదళ కేంద్రం ది సిటీ ఆఫ్‌ డెస్టినీ విశాఖపట్నం పాత్ర చిరస్మరణీయమైనది.

విశాఖపట్నం పేరు మీద రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధనౌకను ఇటీవలే అప్పగించారు. కొత్త తరం యుద్ధనౌకల్లో ఐఎన్‌ఎస్‌ విశాఖ భారతీయ యుద్ధనౌకల్లో కచ్చితంగా గర్వకారణంగా నిలుస్తుంది. ఇది భిన్నమైన సామర్ధ్యం కలిగిన యుద్ధనౌక. 

ఇటీవలే కమిషన్‌ అయిన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి దేశీయంగా జలాంతర్గామిలను రూపొందించడంలో మన శక్తి సామర్ధ్యాలను నిరూపించింది. 


భారత నౌకాదళం ఆధ్వర్యంలో 39 దేశాలతో కలిపి మిలాన్‌ పేరుతో జరిగే నౌకాదళ విన్యాసాలకు మన విశాఖ సాగర తీరం విడిది అయింది. ఇది ఒక అరుదైన యుద్ధనౌకా విన్యాసాల పండుగ. ఈ పండుగకు దాదాపుగా 39 దేశాలను ఆహ్వానించడం జరిగింది. భారత నౌకాదళానికి, ప్రత్యేకించి ఈస్ట్రర్న్‌ నేవల్‌ కమాండ్‌కు అనేక దేశాల నుంచి వచ్చి, ఈ విన్యాసాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. 


ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం అనే యుద్ధనౌకను కొద్ది కాలం క్రితమే నౌకాదళంలోకి తీసుకురావడం జరిగింది. ఈ నౌకపైభాగం మీద కూడా ప్రత్యేకించి మన విశాఖపట్నంలోని డాల్ఫిన్‌ లైట్‌హౌస్‌ను, ఇక్కడ సహజంగా, ప్రకృతి ప్రసాదంగా ఏర్పడిన డాల్ఫిన్‌నోస్‌ను, మన రాష్ట్ర మృగం కృష్ణజింకను ఐఎన్‌ఎస్‌ విశాఖ మీద చిత్రీకరించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొత్తగా నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి మన విశాఖ తీరంలోకి రావడంతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఇలాంటి నౌకలతో జరిగే విన్యాసాలు విశాఖ ప్రజలతో ఎంతో ఉత్సాహంతో పాటు మన దేశ రక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్న సైన్యం మీద మరింత నమ్మకం పెరుగుతుంది. మరింత అభిమానాన్ని పెంచుతుంది. ఈ విన్యాసాల ద్వారా మన సైనిక శక్తి మీద మరింత నమ్మకాన్ని పెంచగలుగుతామని సంపూర్ణంగా భావిస్తున్నాం. 


చివరగా...  39 దేశాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు, భారత నావికాదళం నుంచి పాల్గొన్న ఇతర ప్రతినిధులు, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్స్, ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ మరియు ఫైర్‌ సర్వీసెస్‌ , సీ కాడెట్‌ కాప్స్, నేవీ కాడెట్‌ కాప్స్, స్కూల్స్, మిత్ర దేశాలు, బ్యాండ్‌ ట్రూప్స్, కల్చరల్‌ ట్రూప్స్‌ కలిపి అధ్భుతంగా నిర్వహించిన పెరేడ్, విన్యాసాలు ఈ కార్యక్రమాన్ని మంచి జ్ఞాపకంగా మిగిల్చాయి. 

రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్‌ నేవీ కలిసి సంయుక్తంగా ఈ తరహా కార్యక్రమానికి విశాఖపట్నం కేంద్రంగా అతిధ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. మా ఆతిధ్యంలో

ఇక్కడికి వచ్చిన అధికారులకు, సెయిలర్స్‌కు సౌకర్యవంతంగా ఉందని భావిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాం అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 


ఈ కార్యక్రమంలో నావికాదళ ఉన్నతాధికారులతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Comments