అన్ని గ్రామాల్లో ఘన వ్యర్ధాల నిర్వహణ జరగాలి.
ఆ ప్రతి ఇంటి నుండి వ్యర్ధాలను వేరుచేసి సేకరించాలి
శాసనసభ్యులు
*అంబటి రాంబాబు*
రాజుపాలెం (ప్రజా అమరావతి);
అన్ని గ్రామాల్లోని ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాల ద్వారా సంపద సృష్టి జరగాలని శాసనసభ్యులు *అంబటి రాంబాబు* ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కొండమోడు గ్రామంలోని ఎస్ డబ్ల్యూ పి సి ( ఘనవ్యర్ధాల నిర్వహణ )కేంద్రంలో జరిగిన సత్తెనపల్లి మండల ప్రజా ప్రతినిధుల,క్లాప్ మిత్రల సమావేశంలో ఆయన
ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ ( క్లాప్) , జగనన్న స్వచ్చ సంకల్ప కార్యక్రమం ఐ టి సి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అంబటి మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుండి వ్యర్థాల సేకరణ, విభజన, అనంతరం ఎస్ డబ్ల్యూ పి సి లో సంపద గా మారే వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకొని లక్ష్యాలను సాధించాలన్నారు. సత్తెనపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సంపద సృష్టి జరిగేలా చర్యలు అందరూ తీసుకోవాలన్నారు. విద్యుత్తు, మంచినీరు, పిట్ల నిర్మాణాలు ఇతర వనరులు, వసతుల కల్పన పది రోజుల్లో పూర్తి కావాలని అధికారులు ఆదేశించారు. నందిగామ, కొండమోడు గ్రామాల మాదిరిగా అన్ని గ్రామాల ఎస్ డబ్ల్యూ పి సి లు తయారు కావాలన్నారు. వ్యర్ధాలను సక్రమంగా నిర్వహిస్తే గ్రామాలు ఆరోగ్యం, ఆహ్లాదం ఆదాయం సమకూర్చుకుంటాయన్నారు
కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, రాజుపాలెం మండల కన్వీనర్ ఏపూరి శ్రీనివాస్ రావు, మర్రి సుబ్బారెడ్డి, దొంతిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఐటిసి రిసోర్స్ పర్సన్ బొల్లయ్య, కోటేశ్వరరావు, అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యదర్శులు, క్లాప్ మిత్రలు, గ్రీన్ గార్డ్,లు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment