రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ


అమరావతి (ప్రజా అమరావతి);


రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ


*2021 నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టంతో పాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా నష్టపోయిన 5,71,478 మంది రైతన్నలకు రూ. 534.77 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ, 1220 రైతు గ్రూపులకు వైఎస్సార్‌ యంత్రసేవా పథకం క్రింద రూ. 29.51 కోట్ల లబ్ధితో కలిపి మొత్తం రూ. 564.28 కోట్లని నేడు ( 15.02.2022, మంగళవారం) బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాలకు జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*రైతన్నకు అండగా శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం...ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పూర్తి పరిహారం అందాలి, అదీ సకాలంలో అందాలి*


*ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగానే నష్టపరిహారం చెల్లిస్తామన్న మాట మరోసారి నిలబెట్టుకుంటూ...రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ*


*రబీలో విత్తనాలు వేసుకుని వర్షాల వల్ల మొలక శాతం దెబ్బతిన్న రైతులకు 80 శాతం రాయితీతో మళ్ళీ విత్తుకోవడానికి 1.21 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు ఆ రోజే అప్పటికి అప్పుడే విత్తనాలు సరఫరా చేసిన మనసున్న ప్రభుత్వం*


*శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 19.67 లక్షల మంది రైతన్నలకు అందించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ అక్షరాల రూ. 1,605.33 కోట్లు*


*గత ప్రభుత్వంలో...నాడు*


అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, అయినవారికే పరిహారం. రైతన్నలు క్షేత్రస్ధాయి ఉద్యోగుల చుట్టూ తిరిగి ఏళ్ళ తరబడి ఎదురుచూసినా నష్టపరిహారం అందుతుందో లేదో తెలియని దుస్ధితి. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరికొన్ని సందర్భాలలో రెండు, మూడు సీజన్ల తరువాతనే సాయం అందేది. అరకొరగా అందే ఆ పరిహారానికి కూడా మధ్యవర్తులు, దళారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్ధితి.


*మనందరి ప్రభుత్వంలో...నేడు*


శాస్త్రీయంగా, అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ–క్రాప్‌ ఆధారంగా పంట నష్టాల అంచనా. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శించి మరీ, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగానే పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం


*నాడు...*


అరకొరగా, ఆలస్యంగా, అదీ కొందరికే సాయం

2014 ఖరీఫ్‌లో సంభవించిన కరువుకు నవంబర్‌ 2015లో, 2015 కరువుకు నవంబర్‌ 2016లో సాయం అందించారు

2015 నవంబర్, డిసెంబర్‌ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన రూ. 260.43 కోట్ల పంట నష్టానికి అందించిన సాయం సున్నా.

2016 కరువుకు జూన్‌ 2017లో, 2017 కరువుకు ఆగష్టు 2018లో, 2018 పెతాయి సైక్లోన్‌ నష్టాలకు ఫిబ్రవరి 2019లో సాయం అందించారు

2018లో కరువు వల్ల ఖరీఫ్‌లో రూ. 1,832.28 కోట్లు, రబీలో రూ. 356.45 కోట్ల పంట నష్టానికి అందించిన సాయం సున్నా


*మరి నేడు...ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌లోనే పరిహారం*


2020 మార్చివరకు కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన 1.56 లక్షల మంది రైతులకు రూ. 123.70 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ 2020 ఏప్రిల్‌ లో అందజేత


2020 ఏప్రిల్‌ నుండి 2020 అక్టోబర్‌ వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన 3.71 లక్షల మంది రైతులకు రూ. 278.87 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ 2020 అక్టోబర్‌లో అందజేత


2020 నవంబర్‌ చివరిలో నివార్‌ సైక్లోన్‌ వల్ల నష్టపోయిన 8.35 లక్షల మంది రైతులకు రూ. 645.99 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ 2020 డిసెంబర్‌లో అందజేత


2021 సెప్టెంబర్‌ నెల చివరిలో గులాబ్‌ సైక్లోన్‌ వల్ల నష్టపోయిన 34,556 మంది రైతులకు రూ. 21.96 కోట్ల సాయం 2021 నవంబర్‌లో అందజేత


*నాడు*


కౌలు రైతులకు ఎలాంటి మేలు జరగలేదు. వాస్తవ సాగుదారులు కాని భూయజమానులకు మాత్రమే లబ్ధి


*నేడు*


ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా పంట నష్టాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నందున కౌలు రైతులతో పాటు వాస్తవ సాగుదారులందరికీ లబ్ధి


*నాడు*


రైతన్నలకు లబ్ధిదారుల జాబితా చూసుకునే వెసులుబాటు లేని దుస్ధితి, పారదర్శకతకు పాతర


*నేడు*


లబ్ధిదారుల జాబితాలు సోషల్‌ ఆడిట్‌ కొరకు రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నందున గ్రామ స్ధాయిలోనే రైతులు తమ వివరాలు చూసుకుని, పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు.

Comments