మధ్యాన భోజన పథకాన్ని స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.

  మంగళగిరి (ప్రజా అమరావతి); వీవర్స్ కాలనీలో స్కూల్ను, గణపతి నగర్ లో శిథిలావస్థకు చేరిన ఎలిమెంటరీ స్కూల్ ను ఎమ్మెల్యే ఆర్కే , ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు , MTMC కమిషనర్ శారదా దేవి , విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది...


వివర్స్ కాలనిలో ఉన్న స్కూలు తరగతి గదులు ఇప్పుడు ఉన్న విద్యార్థుల సంఖ్యకు సరిపోవటం లేదని అవసరమైన తరగతి గదులు నిర్మించడానికి స్కూల్ ఆవరణలో స్థలం లేకపోవడం వలన గణపతి నగర్ లో ఉన్న ఎలిమెంటరీ స్కూలు శిథిలావస్థకు చేరడంతో దానిని డిమాలిష్ చేసి నూతన భవనం   నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.


అనంతరం మధ్యాన భోజన పథకాన్ని స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.


Comments