వైఎస్ఆర్ కడప జిల్లా (ప్రజా అమరావతి);
ఆదివారం ఉదయం 11.45గం.లకు కడప నగరం రిమ్స్ జిజిహెచ్ ఆస్పత్రి సమీపంలో అత్యాధునికంగా నిర్మించిన పుష్పగిరి విట్రేయో రెటినా ఇన్స్టిట్యూట్ వద్దకు చేరుకుని పుష్పగిరి ఐ హాస్పిటల్ చైర్మన్ ఆర్. గోవిందారి, ప్రతినిధులు డా.విశాల్ గోవిందారి, ఛైర్మన్-మెడికల్ డా.విశ్వనాథ్ లతో కలిసి కంటి ఆస్పత్రిని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి
.
పుష్పగిరి విట్రేయో రెటినా కంటి ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం.. ఆసుపత్రిలోని రిసెప్షన్, కన్సల్టేషన్స్, ఆపరేషన్ థియేటర్స్, 150 పడకల బ్లాకు, ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి.
ఆధునిక సౌకర్యాలతో కంటి ఆస్పత్రిని నిర్మించినందుకు సంస్థ చైర్మన్ ను, ప్రతినిధులను ముఖ్యమంత్రి అభినందించారు. రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడేలా నాణ్యమైనమెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆసుపత్రి ప్రతినిధులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు, ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, జేసిలు సిఎం.సాయికాంత్ వర్మ, హెచ్ఎం.ధ్యానచంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (నార్త్ అమెరికా) రత్నాకర్ పండుగాయల, డ్వామా పీడి యదుభూషన్ రెడ్డి, డిఎంఅండ్హెచ్ఓ డా. నాగరాజు, రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ప్రసాదరావు, పుష్పగిరి ఐ హాస్పిటల్ ట్రస్టీలు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment