పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఏటా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతోంది



కొవ్వూరు (ప్రజా అమరావతి); 


కొవ్వూరు డివిజన్ వ్యాప్తంగా 1,09,206 మంది ఐదేళ్ల లోపు వయసు పిల్లలుండగా, 792 పల్స్‌ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి వారందరికీ పోలియో చుక్కలు ఈరోజు వేస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.


ఆదివారం స్థానిక మునిసిపల్ కార్యాలయం ఆవరణలో పోలియో చుక్కలు కార్యక్రమాన్నీ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిండు జీవితానికి రక్షణ రెండు చుక్కలు,  పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఏటా ప్రభుత్వం పల్స్ పోలియో  కార్యక్రమం చేపడుతోందన్నారు


. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో  ట్రాన్సిట్‌ కేంద్రాలు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆమె  తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా 5 ఏళ్ళు లోపు ఉన్న పిల్లలు అందరికి పోలియో చుక్కలు వేయించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.  డివిజన్ లోని 792 కేంద్రాలు ద్వారా 5 సంవత్సరాల వారు 109206 మందికి వ్యాక్సినేషన్ వేసేందుకు అవసరమైన డోసులు సిద్ధం చేసామని, ఇందుకోసం 3212 మంది  వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారని తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు పట్టణంలో 28 పోలియో  కేంద్రాల ద్వారా 120 మంది సిబ్బంది 4369 మంది 5 సంవత్సరాలు లోపు చిన్నారులకు పోలియో వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార జాతులు, భిక్షాటన చేసేవారు, ఇటుక బట్టీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మురికి వాడలు, ఆదివాసీ లకు పిల్లలపై సిబ్బంది ఈ సారి ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతోందన్నారు.


మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి మాట్లాడుతూ,  కొవ్వూరు లోని 23 వార్డుల పరిధిలో ఉన్న 24 స్కూల్స్, 52 అంగన్వాడీ కేంద్రాల్లో, మూడు మొబైల్ టీమ్స్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న ట్లు తెలిపారు.  పోలియో చుక్కలు వేసుకోని చిన్నారులను ప్రత్యేక బృందాల సాయంతో , తదుపరి రెండు రోజుల పాటు ఇంటింటికీ తిరిగి ఆయా చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నామన్నారు.


ఈ కార్యక్రమానికి ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, కౌన్సిలర్లు, వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



Comments