*గ్రామ సేవకులు భిక్షాటన
*
నిడమర్రు (ప్రజా అమరావతి): పశ్చిమగోదావరి
రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ముందు శిభిరాలు ఏర్పాటు చేసి నిరసనలు నిరాహార దీక్షలు చేస్తున్నారు అందులో భాగంగా మంగళవారం గ్రామ సేవకులు తహసిల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి నిడమర్రు గ్రామం జంక్షన్ వద్ద ఆటోలు , లారీలు ఆపుతూ (అయ్యా అమ్మ) భిక్షం అంటూ భిక్షాటన చేస్తూ మా సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుతూనే ఉంటామని గ్రామ సేవకులు సంఘం *మండలం ప్రెసిడెంట్ సంకెళ్ళమోహనరావు* అన్నారు. ఎన్నో ఏళ్లు శ్రమించాము ఇదే ఉద్యోగం చేస్తూ మా వాళ్ళు మరనించారు రోజురోజుకి నిత్యవసర వస్తువులు ధరలు పెరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఉన్న జీతం కుటుంబ పోషనకు ఇబ్బంది కరంగా ఉందని అందుకే మా గ్రామ సేవకులు జీతాలు 21 వేల రూపాయలకు పెంచమని నిరసనలు ద్వారా తెలుపుతున్నామని అన్నారు. రిలే నిరహార దీక్షలలొ భాగంగా ఈ రోజు భిక్షాటన చేస్తున్నామన్నారు.
*ముగ్గళ్ళ జాన్* మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము వీఆర్ఏలను నిర్లక్ష్యం చేస్తూ వారి యొక్క సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు..వి .అర్. ఏ లకు కనిసవేతనం రూ 21,000/లు జీతం ఇవ్వాలని, డి.ఏ తో కలిపి వేతనం ఇవ్వాలని నామినీలను వి.ఆర్.ఏలుగా గుర్తించి నియమించాలని, అర్హులైన వారికి ప్రమోషనులు ఇవ్వాలని అన్నారు. 65 సంవత్సరాలు దాటి చనిపోయిన వీఆర్ఏల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు పై డిమాండ్లు యొక్క సాధన కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు
గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు ఆందోళన రూపంలో విన్నవించినా ఫలితం లేకపోవడం వల్ల ఈ విధంగా అంచెలంచెలుగా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు *మామిడి సూరిబాబు* మాట్లాడుతూ మండల తాసిల్దార్ కేంద్రాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం, అన్ని తిరిగి ఆఖరికి భిక్షాటన కార్యక్రమాన్ని రూపొందించుకున్నామన్నారు ఈ పోరాట పటిమను పటిష్ట పరుస్తూ ఆందోళనలో ఉద్ధృతం చేయడానికి ప్రతి గ్రామ సేవకుడు సహకరించి ముందుకు రావాలని అన్నారు. ఈ నిరాహార దీక్షలో అన్ని గ్రామాల గ్రామ సేవకులు పాల్గొన్నారు . నాయకులు సీతారాముడు జాన్,సూరి,బుల్లియ్య , రాజు సీతారాముడు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment