గొప్ప సందేశ సభగా 'మహిళా దినోత్సవం'


గొప్ప సందేశ సభగా 'మహిళా దినోత్సవం'


- 8న సీఎం నాయకత్వాన స్ఫూర్తి సభ

- సర్పంచి నుంచి మంత్రుల వరకు..

- విజయవాడ వేదికగా ఒకేచోటికి 15వేల మంది మహిళా నేతలు

- మహిళా కమిషన్, మహిళా శిశుసంక్షేమ శాఖ సంయుక్త ఏర్పాట్లు

- మీడియా సమావేశంలో ' వాసిరెడ్డి పద్మ' వెల్లడి


అమరావతి (ప్రజా అమరావతి):

మహిళా సాధికారత స్ఫూర్తితో మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక గొప్ప సందేశ సభగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. సోమవారం రాష్ర్ట కమిషన్ కార్యాలయంలోని తన చాంబర్ లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 

మహిళను సగర్వంగా తలెత్తుకుని పని చేసుకునే స్థాయికి తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన దాదాపు 15 వేలమంది మహిళా నేతలతో విజయవాడలో కొనసాగే సభ స్ఫూర్తిని నింపుతుందన్నారు. మహిళా సాధికారత విషయంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సర్పంచి నుంచి మంత్రుల వరకు నామినేట్ పదవులను కేటాయించడంలో అన్నిరంగాలకు పదవులిచ్చి 

మహిళా సాధికారత అంటే ఏంటో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారని.. ఇచ్చిన మాటను నిర్ణయంగా... తీర్మానం చేసి అన్నిరంగాల్లో  50శాతం మహిళా రిజర్వేషన్ ను అమలు చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు.  8న మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర మహిళా కమిషన్ మరియు మహిళా శిశుసంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ గొప్ప సందేశ సభను నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, ఎంపీటీసి, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచ్ లతో పాటు అందరూ సభలో పాల్గొంటారని వివరించారు. సమాజంలో గౌరవం ఉండేలా ముఖ్యమంత్రి మహిళలను నిలబెడుతున్నారని చెప్పారు. మహిళలకు స్ఫూర్తిగా ఈ సభ జరగనుందన్నారు. మహిళా సాధికారత విషయంలో సీఎం రెండున్నరేళ్లలో దేశానికే దిశ చూపెట్టే విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. మహిళల భద్రత, రక్షణ విషయంలో దిశయాప్, దిశ స్టేషన్ లు, దిశ చట్టంతో మిగతా రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉందన్నారు. మీడియా సమావేశంలో మహిళా కమిషన్ కార్యదర్శి శైలజ ఉన్నారు. 



Comments