కాకాణి చేతులమీదుగా విద్యార్థులకు నగదు బహుమతులు

 *"కాకాణి  చేతులమీదుగా విద్యార్థులకు నగదు బహుమతులు


"*




శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), వెంకటాచలం మండలం  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" కార్యక్రమంలో భాగంగా  నిర్వహించిన  వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీల్లో నియోజకవర్గ స్థాయి   పోటీలలో గెలుపొందిన  విద్యార్థినీ విద్యార్థులకు  బహుమతి ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.* 


*ఈ కార్యక్రమం లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మొదటి బహుమతిగా రూ.25 వేలు , రెండవ బహుమతిగా రూ.15 వేలు , మూడవ బహుమతిగా రూ.10 వేలు మరియు నాలుగు ఐదు బహుమతులుగా చెరొక రూ.5 వేలు అందించడం జరిగింది .*


*పువ్వుల వర్షంతో కాకాని కి ఘనస్వాగతం పలికిన విద్యార్థినీ విద్యార్థులు.* 


*ఈ కార్యక్రమంలో నూట ఇరవై మంది పిల్లలకు కాకాణి  గోవర్ధన్ రెడ్డి గారు స్వయంగా బహుమతులు అందజేయడంతో  ఆనందంతో తబ్బిబ్బైన  విద్యార్థినీ విద్యార్థులు.*


*సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సన్మానించిన కాకాణి .*


*వెంకటాచలం గ్రామపంచాయతీ తరపున కాకాని గోవర్ధనరెడ్డి గారిని గజమాలతో ఘనంగా సత్కరించిన సర్పంచి మరియు గ్రామ ప్రజలు .*


*ఈ సందర్బంగా  ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో  అలరించిన చిన్నారుల నృత్యాలు.*  




సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" పేరిట ధన్యవాదాలు తెలియజేసేందుకు వారం రోజుల పాటు, ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించాం.


సర్వేపల్లి నియోజకవర్గ వారోత్సవాలలో భాగంగా 5 మండల కేంద్రాలలో ర్యాలీలు, ఊరేగింపులు, సభలు నిర్వహించడంతో పాటు, అంగన్వాడి స్కూళ్ల నుండి ఉన్నత పాఠశాలలోని పిల్లలందరికీ 50వేల చాక్లెట్ ప్యాకెట్ల పంపిణీ, మండల ప్రజా పరిషత్ లలో, గ్రామ పంచాయతీలలో జగనన్నకు ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమాలను ఏర్పాటు చేశాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో యువత బైక్ ర్యాలీ, ముత్తుకూరు మండలంలో ప్రజా ర్యాలీ, వెంకటాచలం మండలంలో ఉద్యోగుల ర్యాలీ, మనుబోలు మండలంలో రైతుల ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ, తోటపల్లిగూడూరు మండలంలో మహిళల ర్యాలీ నిర్వహించాం.


సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడంతో, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, అన్ని కార్యక్రమాలను ఊహించిన దానికన్నా మిన్నగా విజయవంతం చేయడంలో భాగస్వాములయ్యారు.


సర్వేపల్లి నియోజకవర్గంలో ఊరు , వాడ అన్ని చోట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని దైవ సమానంగా బావిస్తూ పాలాబిషేకం  నిర్వహిస్తూ , పూలు చల్లి ప్రజలందరితో కలిసి గ్రామ స్థాయిలో ర్యాలీలు చేపట్టడం సంతోషకరం .


సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని మండల పరిషత్ పాలకవర్గాలు , గ్రామ పంచాయతీ పాలకవర్గాలు సర్వేపల్లిని నెల్లూరులో కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి దన్యవాదాలు తెలిపే తీర్మానాలు ఆమోదించినందుకు  నా దన్యవాదాలు .


సర్వేపల్లి నియోజకవర్గాన్ని  ప్రజల ఆకాంక్ష మేరకు నెల్లూరు జిల్లాలో కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు .


పార్లమెంటుకు అదనంగా ఒక నియోజకవర్గాన్ని కలిపి జిల్లాను ఏర్పాటు చేయడమనేది అసాధారణ నిర్ణయం  అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఘనంగా ధన్యవాదాలు తెలపాలనే ఉద్దేశ్యంతో వారంరోజులపాటు వారోత్సవాలు  నిర్వహించాం .


సర్వేపల్లి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో  కలిపి ఉన్నట్లయితే నియోజకవర్గంలోని ప్రజలు   సాగునీటి పరంగా  , వ్యవసాయపరంగా , వైద్య సేవల పరంగా ,విద్య పరంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది.


రాబోయే తరాలకు నేడు జరిగిన జిల్లాల పునర్విభజన  ప్రాముఖ్యత తెలియాలి అనే ఉద్దేశంతోనే  రేపటి పౌరులైన  విద్యార్థిని విద్యార్థులకు  వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది.


వ్యాసరచన మరియు వక్తృత్వ నైపుణ్యాలు  ఒకే విద్యార్థిలో ఉండడం  చాలా అరుదు. అటువంటి అరుదైన లక్షణాలను కూడా ప్రోత్సహించడమే ఈ పోటీల  ముఖ్యఉద్దేశం.


ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపే ఈ కార్యక్రమం ఈ వారోత్సవాలతో ముగిసిపోదు.


సర్వేపల్లి నియోజకవర్గం  నెల్లూరు జిల్లాలో ఉండడం ఎంత అవసరమో అనేది పిల్లలందరికీ అర్థమయ్యేవరకూ  ఈ కార్యక్రమం కొనసాగిస్తాము . చిత్రలేఖనం మరియు కవిత్వం వంటి పోటీలు కూడా త్వరలోనే నిర్వహించబోతున్నాం.


ఈ వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థి విద్యార్థినులకు  నా హృదయపూర్వక అభినందనలు. 


సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థి చదువే కాకుండా ఇటువంటి పోటీలలో  కూడా నైపుణ్యం సాధించాలి అన్నది  నా అభిమతం.


"జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" కార్యక్రమానికి అఖండ విజయాన్ని చేకూర్చిన సర్వేపల్లి నియోజకవర్గ యువతకు , ప్రజలకు , అధికారులకు , రైతులకు మరియు మహిళలకు , ప్రజా ప్రతినిధులకు, నాయకులకు , పార్టీ కార్యకర్తలకు పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు .


సర్వేపల్లి నియోజకవర్గాన్ని, ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి చేసుకోవడంతో పాటు, అన్ని వర్గాల ప్రజలకు సమగ్రంగా, కార్యక్రమాలు అమలు చేసి, అందరి కన్నా మిన్నగా, సమిష్టి కృషితో అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుదాం.

Comments