డిగ్రీ కళాశాల అభివృద్ధికి, భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తాననికొవ్వూరు (ప్రజా అమరావతి); 


కొవ్వూరు డిగ్రీ కళాశాల అభివృద్ధికి, భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని


రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.


శనివారం స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కళాశాల ప్రిన్సిపాల్ జె.సునీత దేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రక్తదానం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని , రక్తదానం తో మరొకరి ప్రాణాలను కాపాడ గలుగుతామన్నారు.  ఒక మనిషి చేసిన రక్తదానం వల్ల నలుగురు పేషెంట్ల ప్రాణాలను కాపాడ గలమన్నారు. ఆరోగ్య వంతుడైన మనిషి శరీరంలో 5 లేక 6 లీటర్ల బ్లడ్ ఉంటుందని,  అందులోంచి 350 మిల్లీ లీటర్ల బ్లడ్ సంవత్సరంలో మూడు లేక నాలుగు సార్లు ఇవ్వవొచ్చని, ఇందువల్ల  ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడవని తెలిపారు.  ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా రక్త దానం చెయ్యడం తోపాటు అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ సునీత ఇటువంటి శిబిరాన్ని ఏర్పాటు చెయ్యడం అభినందనీయమన్నారు. రక్తదానం ఇవ్వడానికి ముందుకు వొచ్చిన విద్యార్థులను మంత్రి అభినందించారు. కొవ్వూరు డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


ప్రిన్సిపాల్ జె. సునీత దేవి మాట్లాడుతూ, డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు 4.48 ఎకరాలు స్థలాన్ని, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని నియమించడంలో మంత్రి చొరవ కి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.


ఈకార్యక్రమంలో మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, కౌన్సిలర్లు, బ్లడ్ బ్యాంకు ప్రతినిధుల, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.