"రాజ్యాంగ పరిరక్షణ" ద్వారానే "ప్రజాస్వామ్య" మనుగడ

 "రాజ్యాంగ పరిరక్షణ"  ద్వారానే "ప్రజాస్వామ్య" మనుగడ



.*


రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి.

గుంటూరు (ప్రజా అమరావతి);

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కలలుగన్న ఆర్థిక, సామాజిక అసమానతలు లేని ప్రజాస్వామ్యం వర్ధిల్లాల0టే రాజ్యాంగ పరిరక్షణ అత్యంత ఆవశ్యకమని రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు.


ఆదివారం స్థానిక ఏసీ కళాశాల సమావేశ మందిరంలో రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక ప్రధమ రాష్ట్ర మహా సభలు ఘనంగా నిర్వహించారు.


సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నో కలలు, ఆశయాలతో ఏర్పడిన భారత రాజ్యాంగానికి గత ఏడు దశాబ్దాలుగా  పాలకులు ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన పారదర్శకంగా ను అధికారులు ప్రజలకు జవాబుదారీ తనంతో ఉంటేనే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందని చెప్పారు.                 


ప్రస్తుతం భారత ప్రజాస్వామ్యం నేతిబీరకాయలో నెయ్యి చందంగా ఉన్నదని ప్రజాస్వామ్యం పేరుతో అభివృద్ధి నామమాత్రంగా ఉంటూ అవినీతి విశృంఖలత్వం గా ఉన్నదన్నారు. 


గ్రామపంచాయతీ స్థాయి నుండి ప్రధానమంత్రి కార్యాలయం వరకు అవినీతి విలయతాండవం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.                     


ప్రజలు ఆకలి దప్పులు నుండి బయటపడాలంటే వారి జీవితాలు ఆనందంగా ఉండాలంటే మొట్ట మొదటిగా ప్రజలకు ప్రజాస్వామ్యం హక్కులు విధులు,బాధ్యతలు గురించి వారిని చైతన్యవంతం చేయటమే ప్రధానమన్నారు.


ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ పుట్టా సురేంద్ర బాబు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ క్రియా వ0తం చేయడానికి సమాచార హక్కు వేదిక , సత్యాన్వేషణ మండలి, జనవిజ్ఞాన వేదిక, జై భారత్ ట్రస్టు,ధర్మాచరణ మండలి సంయుక్తంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.  


ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ  సమాచార హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణం లాంటిదని గ్రామ సభల ద్వారా సమాచార హక్కు చట్టంపై నిరంతరం చైతన్యం కల్పిస్తూ పౌరులకు రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులు బాధ్యతల గురించి చట్టాల గురించి నిరంతరం అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక సమన్వయకర్తలు పి రమణ మూర్తి, j. కృష్ణ కిషోర్,మహిళా అధ్యక్షురాలు ఎం మాధవి, రాష్ట్ర నాయకులు జగన్ మోహన్ రావు, కోట ప్రసాదరావు 13 జిల్లాల నుండి కమిటీల సభ్యులు 1000 మంది కి పైగా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments