విజయవాడ (ప్రజా అమరావతి);
వెటరన్ జర్నలిస్టు నిమ్మకాయల శ్రీరంగనాథ్ మృతిపట్ల రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. శ్రీరంగనాథ్ జీవితమంతా బలమైన వామపక్ష రాజకీయ దృక్పథాన్ని కలిగి ఉన్నారని.. నీటిపారుదల రంగంలో మంచి నైపుణ్యం గల వ్యక్తిగా డెల్టా వ్యవస్థపై దిద్దుబాట్లు, మెరుగుదలకు అనేక పరిశోధనాత్మక కథలను కూడా రాశారని ఆయన మరణం పత్రికా లోకానికి తీరని లోటని, మంగళవారం ఒక ప్రకటనలో మంత్రి తెలియజేశారు.
నిమ్మకాయల శ్రీరంగ నాథ్ యువతకు మార్గదర్శకత్వం వహించేవారని, అనేక మంది యువ జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ అండ్ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారి మృతికి కమిషనర్ తన సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. రంగనాథ్ అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.
addComments
Post a Comment