న్యూఢిల్లీ – ఫిబ్రవరి 19, (ప్రజా అమరావతి) :
ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ప్రకాశ్
ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) గా నియమితులైన శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు బాధ్యతలు స్వీకరించే ముందుగా అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. తరువాత ఢిల్లీ లోని ఏ.పీ భవన్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని, అమ్మవారు దుర్గా దేవికి పూజలు నిర్వహించారు. అనంతరం ఏ.పీ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ లో ఏ.పీ భవన్ పీ.ఆర్.సీ గా బాధ్యతలు స్వీకరించారు. తదనంతరం మాజీ పీ.ఆర్.సీ శ్రీ అభయ త్రిపాటి గారికి మరణానంతరం నివాళులు అర్పిస్తూ అధికారులు, సిబ్బందితో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెండింగ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ భవన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
addComments
Post a Comment