కాకాణి చేతులు మీదుగా సచివాలయ భవనం ప్రారంభోత్సవం.
"సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేందుకు కృషి చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు".
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలం, సౌత్ ఆములూరు, పాపిరెడ్డిపాళెం గ్రామాలతోపాటు, ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామంలో పర్యటించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
సౌత్ ఆములూరు గ్రామంలో సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.
నూతనంగా నియమితులైన వాలంటీర్లకు నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే కాకాణి.
సర్వేపల్లి నియోజకవర్గాన్ని నా విన్నపాన్ని మన్నించి, నెల్లూరులోనే కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు.
సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతుండడంతో, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు, నిరంతరం సమీక్షించేందుకు అత్యంత వెసలుబాటు కలిగింది.
సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి, వాలంటరీ వ్యవస్థను జోడించి, ప్రజల ముంగిటకే సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.
సచివాలయ సిబ్బందికి అవసరమైన శాశ్వత భవనాలు నిర్మించి, విధులు సక్రమంగా నిర్వహించేందుకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
అధికార పార్టీ శాసన సభ్యునిగా 30 నెలల పదవీకాలంలో తోటపల్లి గూడూరు మండలానికి సిమెంట్ రోడ్లు డ్రైన్లు, తదితర అభివృద్ధి కార్యక్రమాలకు 105 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాం.
సౌత్ ఆములూరు గ్రామంలో ఎన్నడూ లేని విధంగా 4 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
పార్టీలకతీతంగా ప్రజలందరికీ పారదర్శకంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.
తెలుగుదేశం హయాంలో చిన్న, మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలు దిగజారి, నిరుపేదలుగా తయారయ్యారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదలకు, నిరుపేదలకు అండగా నిలిచి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ఆర్థిక సహాయం అందించడం ద్వారా జీవన స్థితిగతులను మెరుగుపరుస్తున్నాం.
సర్వేపల్లి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలిపితే, రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనుకున్న కొంతమంది ఆశలపై నీళ్లు చల్లి, నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడంతో, కుట్రదారులకు నిద్ర పట్టడం లేదు.
సభలు, సమావేశాలు నిర్వహించి వెళ్లిపోవడం కాకుండా, ప్రజలకు చేరువగా, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.
addComments
Post a Comment