జిల్లాలో నమోదైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా దృష్టి సారించడంతో పాటు, బాధితులకు త‌క్ష‌ణ‌మే ప‌రిహారం ఇచ్చేందుకు చ‌ర్య‌లు

  

నెల్లూరు (ప్రజా అమరావతి);

 


జిల్లాలో నమోదైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ  కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా  దృష్టి సారించడంతో పాటు,  బాధితులకు  త‌క్ష‌ణ‌మే ప‌రిహారం ఇచ్చేందుకు చ‌ర్య‌లు


తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు,   అధికారులను ఆదేశించారు.

 

గురువారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్లో జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, అధికారులతో సమావేశమై జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  కేసులకు సంబంధించి బాధితులకు మంజూరు చేయాల్సిన కాంపెన్సేషన్, భూ పరిహారం,  ఉద్యోగ నియామకాలు  తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  జిల్లాలో 2014  సంవత్సరం నుండి   ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  కేసులు పెండింగ్ లో వున్నాయని,  సంబంధిత కేసులు సత్వరం పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, అలాగే బాధితులకు  మంజూరు చేయాల్సిన కాంపెన్సేషన్, భూ పరిహారం,  ఉద్యోగ నియామకాల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. 2019, 2020, 2021  సంవత్సరాలల్లో  నమోదైన 13 కేసులకు సంబంధించి  బాధితులకు భూ పరిహార పంపిణీ పెండింగ్లో  వుందని, అలాగే ఈ  13 కేసులకు సంబంధించి 11 మంది బాధితులకు  కారుణ్య నియామకాలు చేపట్టాల్సివుందని,  ఈ నెలాఖరు నాటికి  బాధిత  కుటుంబాలకు  భూ పరిహారం, కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు,  రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతి నెల  పెండింగ్లో వున్నా ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ  కేసులపై సంబంధిత అధికారులతో సమావేశమై  పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్, డి.ఆర్.ఓ ను ఆదేశించారు. జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  కేసులకు సంబంధించి బాధితులకు  సకాలంలో  పరిహారం చెల్లించినప్పుడే  వారికి న్యాయం  చేకూర్చినట్లు అవుతుందని  జిల్లా కలెక్టర్, అధికారులకు సూచించారు. జిల్లాలో నమోదైన ప్రతి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించిన  ఎఫ్.ఐ.ఆర్ కాపీని  24 గంటల లోపు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ కార్యాలయంనకు పంపడంతో పాటు  ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేసిన అన్ని కేసులకు చార్జిషీట్లు త్వరగా వేసేలా చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులకు సూచించారు.

 

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీమతి రోజ్ మాండ్, జిల్లా రెవిన్యూ అధికారి శ్రీ చిన ఓబులేసు,  సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు శ్రీ చెన్నయ్య, ఎస్.డి.పి  శ్రీ శ్రీనివాసరావు, స్పెషల్   పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ జగదీష్,  కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.



Comments